పసికందు కిడ్నాప్ | Babe kidnapped in guntur | Sakshi
Sakshi News home page

పసికందు కిడ్నాప్

Published Sun, Feb 14 2016 9:10 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Babe kidnapped in guntur

గుంటూరు జిల్లా మాచర్ల మండలం అడిగొప్పుల అమ్మవారి ఆలయం వద్ద ఆరు నెలల బాలుణ్ణి గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు పట్టణానికి చెందిన ఎర్రదేశి రామాంజి, మన్నెమ్మ అనే దంపతులు బంధువులతో కలిసి తమ కుమారుడికి అన్నప్రాశన చేసేందుకు గుంటూరు జిల్లా మాచర్ల మండలం అడిగొప్పుల అమ్మవారి ఆలయానికి శనివారం రాత్రి 8 గంటలకు వచ్చారు.


రాత్రి పొద్దుపోయాక ఆలయం బయట అడుకుంటున్న అరవింద్(6 నెలలు) అనే పిల్లవాణ్ణి గుర్తుతెయని వ్యక్తులు ఎత్తుకుని పిల్లవాడు ముద్దుగా ఉన్నాడని ముద్దాడుతూ పిల్లవాడితో సహా ఉడాయించారు. ఈ హటాత్ సంఘటనతో ఖంగుతున్న పిల్లవాని తల్లిదండ్రులు మాచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పిల్లవాని ఆచూకి కోసం గాలిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement