పాతబస్తీలో వడ్డీవ్యాపారుల ఆగడాలు | Police ride on Pawn Brokers den in Old City at Hyderabad | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో వడ్డీవ్యాపారుల ఆగడాలు

Published Thu, Apr 23 2015 9:06 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

Police ride on Pawn Brokers den in Old City at Hyderabad

హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు  అడ్డుఅదుపు లేకుండా కొనసాగుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశారు. వివరాల్లోకి వెళితే చాంద్రాయణగుట్టలో ట్రావెల్ ఏజెంట్గా పని చేస్తున్న షరీఫ్ అనే వ్యక్తి... వడ్డీ వ్యాపారి నారాయణరెడ్డి వద్ద రూ.10 చొప్పున 2లక్షల 50వేల రూపాయలు ఏడాది క్రితం అప్పు తీసుకున్నాడు.

అయితే సకాలంలో వడ్డీ చెల్లించలేదని షరీఫ్ను బుధవారం నారాయణరెడ్డి అనుచరులు కిడ్నాప్ చేసి ఆల్మాస్గూడలో బంధించి చిత్రహింసలు పెట్టారు. ఈ విషయాన్ని బాధితుడి బంధువులు ఫిర్యాదు చేయటంతో పోలీసులు వడ్డీ వ్యాపారుల డెన్పై దాడి చేసి షరీఫ్ను విడిపించారు.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement