బాలిక అదృశ్యం | The girl disappeared in uppal | Sakshi
Sakshi News home page

బాలిక అదృశ్యం

Published Thu, Oct 15 2015 6:33 PM | Last Updated on Sun, Sep 3 2017 11:01 AM

The girl disappeared in uppal

హయత్ నగర్ బాలుడు నవీన్ ఉదంతం మరవక ముందే ఉప్పల్ లో మరో కిడ్నాప్ ఘటన నమోదైంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల బాలిక అదృశ్యం అయింది. బైక్ పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు తమ బిడ్డను అపహరించారని చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదుచేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. మంగళవారం సాయంత్రం తన ఇంటి ముందు ఆడుకుంటున్న నవీన్ ను గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి అపహరించుకుపోయారు. కిడ్నాపర్ పక్కింటి వ్యక్తే అని నవీన్ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో రోజుకో కిడ్నాప్ కలకలం స్థానికుల్లో గుబులు రేపుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement