రియల్ రెక్కీ | Real wings | Sakshi
Sakshi News home page

రియల్ రెక్కీ

Published Sat, Nov 1 2014 2:47 AM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM

రియల్ రెక్కీ - Sakshi

రియల్ రెక్కీ

వరంగల్ నగరంలో పిల్లల వైద్యుడు సురేందర్‌రెడ్డి కిడ్నాప్ మిస్టరీ మరువక ముందే.. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్‌నకు కుట్ర జరిగింది. నిషేధిత సంస్థతో డీల్ కుదుర్చుకుని రెక్కీ నిర్వహించినా.. సక్సెస్ కాకపోవడంతో అతడిని అంతమొందించేందుకు సిద్ధపడ్డారు. చివరకు నిఘావర్గాల సమాచారంతో పోలీసులకు పట్టుబడ్డారు. ఇదే క్రమంలో మరో ముఠా నిషేధిత సంస్థల సభ్యుల పేరుతో భూ వ్యవహారాల్లో తలదూర్చి.. ఆయుధాలతో సహా పోలీసులకు చిక్కి కటకటాల పాలు కావడం కలకలం రేపింది. వీరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం.
 
వరంగల్ క్రైం : వరంగల్ నగరానికి చెందిన ఓ వ్యాపారి కొంతకాలంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాడు. వెంచర్లు చేసి విక్రయిస్తూ.. బిల్డర్‌గా కొనసాగుతున్నారు. గతంలో ఒక పార్టీలో ఉన్నతస్థాయి నామినేటెడ్ పోస్టులో కొనసాగాడు. అనంతరం రాజకీయాలకు గుడ్‌బై చెప్పి ఫుల్‌టైమ్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కొనసాగుతున్నాడు. గీసుకొండ మండలం గొర్రెకుంట సమీపంలో ఈ వ్యాపారికి పెద్ద వెంచర్ ఉంది. దీంతోపాటు నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్లాట్ల కొనుగోళ్లు, విక్రయించడం చేస్తుంటాడు.

ఈ క్రమంలో మూడే ళ్ల క్రితం ఆరెపల్లిలో ఓ వ్యక్తికి చెందిన భూమిని కొనుగోలు చేయడం.. ఆ తర్వాత విక్రయిం చడం.. ఈ క్రమంలో అది డిస్‌ప్యూట్‌గా మా రింది. తాను అమ్మిన ఆరెపల్లికి చెందిన వ్యక్తికి డ బ్బులు తిరిగి ఇచ్చేవిధంగా సదరు రియల్టర్  ఒప్పందం కుదుర్చుకుని, ఆ భూమిని మరొకరికి విక్రయించాడు. గతంలో పెద్దమనుషుల మధ్య జరిగిన పంచాయితీలో రెండోసారి  భూమి కొనుగోలు చేసిన వ్యక్తి ఆరెపల్లికి చెం దిన భూ పట్టాదారుడికి డబ్బులు ఇచ్చే విధం గా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే సమాచార లోపంతో డ బ్బులు ఇవ్వలేదు.

దీంతో పట్టాదారు తనకు డబ్బులు ఇవ్వాలని.. రెండో వ్యక్తితో సంబంధం లేదని కొద్ది రోజులుగా మొదట కొనుగోలు చేసిన రియల్టర్‌తో పలుమార్లు అన్నాడు. ఈ క్రమంలో సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారికి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. తీవ్ర స్థాయిలో బెదిరిస్తూ ఒత్తిడి తీసుకువస్తున్నప్పటికీ.. సదరు రియల్టర్ డబ్బులు ఇస్తానని చెప్పినట్లు సమాచారం. డబ్బులు ఇవ్వడంలో ఆలస్యం కావడతో ఆరెపల్లికి చెందిన వ్యక్తి.. నిషేధిత సంస్థ సభ్యులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తనకు రియల్టర్ నుంచి డబ్బులు ఇప్పించే విధంగా డీల్ చేసుకున్నాడు.
 
వారం రోజులుగా రెక్కీ

రంగంలోకి దిగిన ఐదుగురు వ్యక్తులు రియల్టర్‌ను వెంబడించారు. గొర్రెకుంట సమీపంలో ఒక మారు కిడ్నాప్‌నకు యత్నించి విఫలమయ్యూరు. వరంగల్ నగరం నడిబొడ్డున ఉన్న రియల్టర్ ఇంటి వద్ద పలుమార్లు ఆటోలో వెంబడించారు. సుమారు నాలుగైదు రోజులపాటు రాత్రివేళలో అక్కడే మకాం వేసినట్లు తెలిసింది. రియల్టర్ ఇంట్లో  శుభకార్యాలు జరగడం.. ఎక్కువ మంది బంధువులు ఉండడంతో అతడిని కిడ్నాప్ చేయడం ఆ ముఠాకు కుదురలేదు. చివరకు బుధవారం మధ్నాహ్నం వీలైతే కిడ్నాప్.. లేదా.. హతమార్చాలని ముఠా సభ్యులు పక్కాగా ప్లాన్‌వేశారు.

ఈ క్రమంలో రెక్కీ చేస్తూ సంచరిస్తున్న వారిలో ఓ వ్యక్తి అదే రోజు కొద్ది గంటల ముందే పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు విచారించగా గుట్టు రట్టయింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీస్ సిబ్బంది ముఠా సభ్యులందరినీ పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. ఇదేవిధంగా మరో గ్యాంగ్ హన్మకొండ పోలీసులకు గురువారం చిక్కింది. వీరు కూడా నిషేధిత సంస్ధల సభ్యుల పేరిట ములుగురోడ్డులోని భూ వ్యవహారాల్లో తలదూర్చి.. పోలీసులకు చిక్కి కటకటాల పాలైనట్లు తెలిసింది. ఈ ముఠానుంచి పోలీసులు ఒక ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
 
నిఘా వర్గాల సమాచారంతోనే..

పోలీసు నిఘావర్గాల సమాచారంతోనే నగరంలో కిడ్నాప్, హత్యకు పథకం రచించిన ఈ ముఠా కార్యకలాపాలు బట్టబయలయ్యాయి. నర్సంపేటకు చెందిన కొందరు, నిషేధిత పార్టీకి సంబంధించిన వ్యక్తులు నగరంలో సంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారం మేరకు వరంగల్ పోలీసులు వారిపై దృష్టి సారించారు. పక్కాగా అందిన సమాచారంతో వారు సంచరిస్తున్న ప్రాంతాలు, ఆయా భూములపై నిఘా పెట్టారు. దీంతో హన్మకొండలో ఒకటి, వరంగల్‌లో మరొక ముఠా పోలీసులకు చిక్కింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement