‘ప్రకాశం’ ఇంజనీర్ క్షేమమే! | prakasam district engineer will be safe | Sakshi
Sakshi News home page

‘ప్రకాశం’ ఇంజనీర్ క్షేమమే!

Published Mon, Jun 23 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 9:13 AM

‘ప్రకాశం’ ఇంజనీర్  క్షేమమే!

‘ప్రకాశం’ ఇంజనీర్ క్షేమమే!

కంపెనీ మేనేజర్‌తో మాట్లాడించిన కిడ్నాపర్లు

ఒంగోలు/హైదరాబాద్: అస్సాంలో అపహరణకు గురైన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కేవీపాలెంకు చెందిన ఇంజనీర్ నాగమల్లేశ్వరరావు సురక్షితంగా ఉన్నారని ప్రకాశం జిల్లా ఎస్పీ పీ ప్రమోద్‌కుమార్ ఆదివారం వెల్లడించారు. తాను ఈ విషయంపై అస్సాంలోని డిమా హసావొ జిల్లా ఎస్పీ వేదాంత ఎం రాజ్‌ఖోవాతో మాట్లాడానన్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో నాగమల్లేశ్వరరావు చేత కిడ్నాపర్లు ఫోన్‌లో వశిష్ట కనస్ట్రక్షన్స్ కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ సత్యనారాయణతో మాట్లాడించారని ఎస్పీ తెలిపారు. తాను క్షేమంగా ఉన్నానని ఇంజనీర్ ఆయనతో చెప్పారన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement