తిరుపతి : తిరుపతిలో కిడ్నాప్ అయిన 27 రోజుల చిన్నారి ఉత్తమ్ ఆచూకీ లభ్యమైంది. తమిళనాడు రాష్ట్రం చిదంబరంలోని వేలూరులో ఉత్తమ్ని పోలీసులు ఆదివారం గుర్తించారు. చిన్నారిని తీసుకుని పోలీసులు చిత్తూరు బయలుదేరారు. మరికాసేపట్లో చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. అయితే చిన్నారిని కిడ్నాప్ చేసినట్లుగా భావిస్తున్న పూజను పోలీసులు అదుపులోకి తీసుకుని... ప్రశ్నిస్తున్నారు.
తిరుపతి రూరల్లోని విద్యా నగర్ కాలనీ నివసిస్తున్న నేపాల్కి చెందిన దంపతులు సంతోష్ కుమార్, బాటుకు ఇటీవలే బాబు జన్మించాడు. ఆ చిన్నారిని శనివారం మధ్యాహ్నం ఆగంతకులు కిడ్నాప్ చేశారు. దాంతో దంపతులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా బాలుడి ఆచూకీ కోసం పలు బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో బాలుడు వేలూరులో ఉన్నట్లు గుర్తించారు.