ముగ్గురు యువకులు పదమూడేళ్ల బాలికను అపహరించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ముగ్గురు యువకులు పదమూడేళ్ల బాలికను అపహరించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి తల్లి బయటకు వెళ్లగా, అదే సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను ముగ్గురు యువకులు ముఖానికి ముసుగులు ధరించి వచ్చి ఆమెను బలవంతంగా తమతో తీసుకెళ్లి సమీప ప్రాంతంలో అత్యాచారం చేసి పరారయ్యారు. దీనిపై బాలిక తల్లి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.