ప్రతీకాత్మకచిత్రం
కోయిలకొండ: ఒక బాలికను లోబరుచుకుని ఇద్దరు యువకులు తరచూ అత్యాచారానికి పాల్పడటంతో గర్భవతి అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలంలోని ఒక గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలికపై కొన్ని నెలల క్రితం కోయిలకొండకు చెందిన గొల్ల రవికుమార్, గడ్డం శ్రీకాంత్ సమీపంలోని పిండిగిర్నీలో అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధితురాలి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు లైంగిక దాడికి దిగారు. వారం రోజుల క్రితం బాలిక కడుపు నొప్పితో బాధపడుతూ తల్లికి చెప్పింది. కోయిలకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా రెండు నెలల గర్భిణి అని తేలింది. దీంతో తల్లి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్‌ఐ శీనయ్య పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment