Koilkonda
-
పలుమార్లు లైంగిక దాడి.. వారం రోజుల క్రితం
కోయిలకొండ: ఒక బాలికను లోబరుచుకుని ఇద్దరు యువకులు తరచూ అత్యాచారానికి పాల్పడటంతో గర్భవతి అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలంలోని ఒక గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలికపై కొన్ని నెలల క్రితం కోయిలకొండకు చెందిన గొల్ల రవికుమార్, గడ్డం శ్రీకాంత్ సమీపంలోని పిండిగిర్నీలో అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు లైంగిక దాడికి దిగారు. వారం రోజుల క్రితం బాలిక కడుపు నొప్పితో బాధపడుతూ తల్లికి చెప్పింది. కోయిలకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా రెండు నెలల గర్భిణి అని తేలింది. దీంతో తల్లి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్ఐ శీనయ్య పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: (వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని కడతేర్చారు) -
కొండకు రామదండు.. పోటెత్తిన భక్తులు
ఆషాఢ అమావాస్య సందర్భంగా ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్ కొండ మండలంలోని శ్రీరామకొండకు వేలాది మంది భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే కొండపైన ఉన్న రాముడి పాదాల దర్శనంకోసం బారులు తీరారు. దాదాపు 40 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. – కోయిల్‌కొండ (మహబూబ్‌నగర్ జిల్లా) ఎరువుల కోసం ఎదురుచూపులు నిర్మల్ జిల్లా లోకేశ్వరం పీఏసీఎస్ కార్యాలయం వద్ద ఆదివారం యూరియా కోసం క్యూలో రైతన్నల చెప్పులు. పచ్చని ‘గిరి’పల్లెలు ఇటీవల కురిసిన వర్షాలకు భూమాత పచ్చరంగు పులుముకుంది. చెట్లు చిగురించి కొండలు పచ్చదనంతో ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి ఒడిలో సేదతీరినట్లు.. కొండల నడుమ గిరి పల్లెలు ఆకట్టుకుంటున్నాయి. ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్‌ధరి, మామిడిగూడ, లోహర గ్రామాలు ప్రకృతి ఒడిలో ఇలా దర్శనమిస్తున్నాయి. – ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ నరికినా నీడనిస్తా.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామ శివారులో పోచాలు అనే రైతు పొలంలో వేపచెట్టు.. పెద్దపెద్ద కొమ్మలతో భారీగా విస్తరించింది. పంటపై నీడ పడుతుండడంతో పోచాలు ఆ చెట్టుకొమ్మలను తొలగించాడు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు చెట్టు మళ్లీ చిగురించింది. ఒకప్పుడు ఆ చెట్టు నీడ పంటపై పడుతుందని నరికేసిన రైతు.. ఇప్పుడు వ్యవసాయ పనులు ముగించుకొన్నాక అదే చెట్టునీడన విశ్రమిస్తున్నాడు. – సాక్షి సీనియర్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్ గూడు కోసం ఆరాటం ఏదో పుస్తకంలో చదివి నేర్చుకున్నట్టు.. ఎవరో గురువు దగ్గర శిక్షణ పొందినంత నేర్పుతోనూ పక్షులు అందమైన గూళ్లను అల్లుకుంటాయి. సెల్ టవర్ల రేడియేషన్ ప్రభావం, ఇతరత్రా కారణాలతో పక్షి గూళ్లు ఇప్పుడు కనిపించడమే అరుదైపోయింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్‌పూర్ చెరువు వద్ద తుమ్మ చెట్టుపై పక్షులు అల్లుకున్న గూడులివి. – సాక్షి సీనియర్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
సీన్ రివర్స్: గేదెల ఎదురుదాడిలో గాయపడిన చిరుత!
కోయిల్‌కొండ/మహబూబ్‌నగర్: ‘ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో’.. ఓ గేదెల గుంపుపై దాడి చేసేందుకు యత్నించిన చిరుత.. వాటికే చిక్కి తీవ్ర గాయాలపాలైంది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలంలో గురువారం చోటుచేసుకుంది. బూర్గుపల్లి శివారు దేవునిగుట్ట సమీపంలోని పొలంలో రైతు నవాజ్‌రెడ్డి పశువుల పాక ఏర్పాటు చేసి అందులో నిత్యం గేదెలను ఉంచేవాడు. గురువారం ఉదయం దేవునిగుట్టలో నుంచి వచ్చిన చిరుత ఒక్కసారిగా పాకలోని గేదె దూడలపై దాడి చేయబోయింది. దీంతో పక్కనే ఉన్న గేదెలు మూకుమ్మడిగా చిరుతపై ఎదురుదాడికి దిగాయి. ఈ క్రమంలో చిరుతకు తీవ్రగాయాలయ్యాయి. అక్కడి నుంచి తప్పించుకున్న చిరుత.. కొంతదూరం వెళ్లి అక్కడే నడవలేని స్థితిలో అచేతనంగా పడిపోయింది. సమాచారం తెలుసుకొని జనం భారీగా తరలివచ్చారు. ఓ వైపు కాళ్లకు గాయాలై నడవలేక పడిపోయిన చిరుత.. ప్రజలను చూసి గాండ్రించడంతో బెంబేలెత్తారు. కాసేపటికి గ్రామస్తులు ఓ బుట్టను నీటితో నింపి సమీపంలో ఉంచగా.. దాహం తీర్చుకుంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చంద్రయ్య, గంగిరెడ్డి చిరుత గాయాలను పరిశీలించారు. హైదరాబాద్ జూపార్క్ నుంచి రెస్క్యూ టీం చిరుతకు మత్తుమందు ఇచ్చి నెహ్రూ జూపార్క్‌కు తరలించింది. చదవండి: ఎంత పని చేశావమ్మా... ఏనుగు! -
కోయిలకొండ పోలీసులకు అరుదైన గౌరవం
మహబూబ్‌నగర్ క్రైం: అందరూ చేసే పని ఒక్కటే.. కానీ అందులో వైవిద్యం.. వేగం.. టెక్నాలజీని ఉపయోగించుకున్న వారికి మాత్రమే ప్రత్యేక గుర్తింపు, గౌరవం తక్కుతాయి. ఇలాంటి పద్దతినే కోయిలకొండ పోలీసులు ఎంచుకోవడం వల్ల జాతీయ స్థాయిలో 79స్థానం దక్కింది. ప్రతి ఏడాది దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేస్తోంది. 2019ఏడాదికి గాను దేశం మొత్తంలో 15,579 పోలీస్స్టేషన్లు ఉండగా.. అందులో జిల్లాలోని కోయిలకొండ పోలీస్ స్టేషన్‌కు 79వ స్థానంతో ఈ అరుదైన అవకాశం దక్కింది. అక్టోబర్‌లో కేంద్రం బృందం సభ్యులు పోలీస్ స్టేషన్ పరిశీలించి ప్రత్యేక రిపోర్టు తయారు చేసుకొని వెళ్లారు. వారం రోజుల కిందట విడుదల చేసిన జాబితాలో కోయిలకొండకు అవకాశం దక్కింది. పెరిగిన టెక్నాలజీ వాడకం మారుతున్న కాలనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే తీరు, కేసుల పరిశోదన వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది దేశ వ్యాప్తంగా ఉత్తమ పోలీస్స్టేషన్లను ఎంపిక చేస్తోంది. కొత్తగా వచ్చిన టెక్నాలజీ వాడకంలో కోయిలకొండ పోలీసులు ప్రత్యేక ముద్ర వేశారు. పోలీస్ స్టేషన్లో నమోదైన ప్రతి కేసును ఆన్లైన్లో పొందుపరచడం, చాలా వరకు కేసులను పెండింగ్‌లో పెట్టకపోవడం వల్ల కార్యక్రమాలు చేపడుతున్నారు. నమోదు అయిన కేసు వివరాలను ఆయా ఫిర్యాదుదారులు సులువుగా ఆన్లైన్ చూసుకునే ఏర్పాటు కల్పించడం చేశారు. వచ్చిన ఫిర్యాదుదారులకు అవసరమైన వసతులు కల్పించడం, స్నేహపూర్వకమైన వాతావరణంలో నడపటం చేశారు. ప్రధానంగా పోలీస్ వ్యవస్థను పటిష్టంగా ఉంచుతూ స్థానికంగా నేరాలను పూర్తిగా నియంత్రణ చేస్తూ వచ్చారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి కేసును పూర్తిగా పరిశీలించిన తర్వాతనే పకడ్బందీగా కేసులు నమోదు చేసి మంచి ఫలితలను సాధించడం, ఇందుకు తగ్గటుగా జాతీయ స్థాయిలో 79వ స్థానం సాధించారు. పచ్చదనానికి కేరాఫ్ పోలీస్ స్టేషన్ మొత్తాన్ని పూర్తిగా పచ్చదనంతో నింపేశారు. వచ్చినవారికి కనువిందు చేసేలా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆలోచనను అమలు చేశారు. ఆవరణలో అందమైన పూల మొక్కలు, గడ్డి మొక్కలు నాటారు. నడిచేందుకు, వాహనం వెళ్లేందుకు ఏర్పాటు చేసిన మార్గం మినహాయించి ఇతర ఖాళీ స్థలమంతా మొక్కలతో నింపేశారు. ఎప్పటికప్పుడు ఎండిన ఆకులను తొలగించడం, కొమ్మలను కత్తిరించడం, రోజూ ఉదయం సాయంత్రం మొక్కలకు నీటిని అందించడం చేస్తున్నారు. బెస్ట్ ఇచ్చాం దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన పోలీస్స్టేషన్లలో చాలా పోటీ ఉండింది. దీంట్లో కోయిలకొండ పోలీస్ స్టేషన్ నుంచి బెస్ట్ ఇచ్చాం. దీంతో ఆ పోటీలో మాకు స్థానం దక్కింది. కొన్ని పారామీటర్స్లలో ఉత్తమ పనితీరు చూసి ఎంపిక చేశారు. కేంద్రం నుంచి అవార్డును కూడా అందజేస్తారు. – రెమా రాజేశ్వరి, జిల్లా ఎస్పీ అందరి కృషితోనే ఉమ్మడి జిల్లా నుంచి కోయిల్‌కొండ పోలీస్‌స్టేషన్‌కు స్థానం దక్కడం జిల్లా పోలీస్‌శాఖకు దక్కిన గౌరవం. దేశ వ్యాప్తంగా కోయిల్‌కొండ స్టేషన్‌కు 79వ స్థానం రావడం ఆనందంగా ఉంది. ఈ స్థానం రావడం వెనుక ఇక్కడ పని చేసే సిబ్బందితో పాటు ఉన్నత అధికారుల కృషి ఉంది. – సురేష్, ఎస్ఐ, కోయిలకొండ -
చెట్టును ఢీకొన్న బైక్: ఇద్దరి మృతి
కోయిలకొండ: ప్రమాదవశాత్తు ఓ బైక్ చెట్టును ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ సమీపంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న ద్విచక్రవాహనం అదుపు తప్పి రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో దామరగిద్దకు చెందిన ఉడుముగిద్ద హనుమంతు(23), మద్దూరు హనుమంతు(23) మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
చిరుత దాడి : 4 మేకలు మృతి
కోయిల్‌కొండ : చిరుత దాడి చేయడంతో నాలుగు మేకలు మృత్యువాతపడ్డాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. కోయిల్‌కొండకు చెందిన అబ్దుల్ సజ్జుకు నాలుగు మేకలు ఉన్నాయి. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం అవి సమీపంలోని ఖిల్లా కోటకు మేత కోసం వెళ్లాయి. అనంతరం చిరుత దాడి చే యడంతో చనిపోయాయని చుట్టుపక్కల ఉన్న గొర్రెలకాపారులు తెలిపారు. ఈ విషయం అటవీశాఖ అధికారులకు సమాచారమివ్వగా సంఘటన స్థలాన్ని డిప్యూటీ రేంజర్లు కృష్ణయ్య, బాలకిష్టయ్య పరిశీలించారు. ఈ ప్రాంతంలో రెండు చిరుతలు కనిపించాయని గొర్రెల కాపరులు అధికారులకు వివరించారు. -
ఎన్నికల కోసం అప్పులు: తీర్చలేక ఆత్మహత్య
కోయిల్‌కొండ (మహబూబ్‌నగర్) : ఎన్నికల కోసం చేసిన అప్పులు తీర్చలేక సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలం బూర్గుపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ దేవమ్మ(60) సర్పంచ్ ఎన్నికల కోసం భారీగా ఖర్చు చేసింది. తన వద్ద నగదు లేకపోవడంతో.. అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టింది. ఎట్టకేలకు తాను అనుకున్న పదవిని దక్కించుకోగలిగింది కానీ.. డబ్బును మాత్రం పోగొట్టుకుంది. గత కొన్ని రోజులుగా అప్పులు తీర్చాలని అప్పులవాళ్లు వేధిస్తుండటంతో.. మనస్తాపానికి గురై మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.