చెట్టును ఢీకొన‍్న బైక్: ఇద‍్దరి మృతి
కోయిలకొండ: ప్రమాదవశాత్తు ఓ బైక్ చెట్టును ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ సమీపంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళుతున‍్న ద్విచక్రవాహనం అదుపు తప్పి రోడ్డుపక‍్కనున‍్న చెట్టును ఢీకొంది.
ఈ సంఘటనలో దామరగిద్దకు చెందిన ఉడుముగిద్ద హనుమంతు(23), మద్దూరు హనుమంతు(23) మృతిచెందారు. సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటనా స‍్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార‍్టం నిమిత‍్తం ఆస‍్పత్రికి తరలించారు.