ప్రేమ వివాహం విషయంలో కిడ్నాప్ కేసు నమోదు | In the case of kidnapping in the case of love marriage | Sakshi
Sakshi News home page

ప్రేమ వివాహం విషయంలో కిడ్నాప్ కేసు నమోదు

Published Fri, Jun 6 2014 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 AM

In the case of kidnapping in the case of love marriage

ఉంగుటూరు, న్యూస్‌లైన్ : ప్రేమ వివాహ విషయంలో  ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి.. చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా,  హత్య చేస్తామంటూ బెదిరించి వదిలివేసిన ఘటన ఉంగుటూరు మండలం తేలప్రోలులో జరిగింది. ఈ వ్యవహారం  విజయవాడ పోలీసు కమిషనర్ వరకు చేరింది.  

ఆయన ఆదేశాల మేరకు కిడ్నాప్‌కు పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ జి. వసంతబాబు గురువారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం తేలప్రోలుకు చెందిన చిటికల కిరణ్, గుంటూరు జిలా ్ల గురజాల మండలం పల్లేగుంత కు చెందిన బండారుపల్లి గౌతమి (24) హైదరాబాదులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి మే 17న పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో వివాహం చేసుకున్నారు.

విషయం తెలుసుకున్న గౌతమి అన్నయ్య బండారుపల్లి ఈశ్వరరావు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు రామ్మోహనరావు, మరికొందరు బుధవారం సాయంత్రం సుమోలో కిరణ్ ఇంటికి వెళ్లారు. తాము పోలీసులమని గుంటూరు జిల్లా నుంచి వచ్చామని కిరణ్ కుటుంబ సభ్యుల్ని నమ్మించారు. వారు తీసుకువచ్చిన సుమోలో కిరణ్ తండ్రి రాజబాబు, సోదరుడు కుమారుడు శ్రీనివాసరావులను ఎక్కించుకుని ఏలూరు తీసుకెళ్లారు.

గుంటూరు తీసుకువెళ్లాల్సిన తమను ఏలూరు తీసుకువెళ్లడంతో అనుమానం వచ్చిన రాజ బాబు, శ్రీనివాసరావులు వారిని ప్రశ్నించారు.  అప్పుడు వాస్తవ విషయాలు చెప్పి.. మా అమ్మాయిని మాకు అప్పగించాలని, పెళ్ళిచేసుకున్న ఆధారాలు చూపాలంటూ  రాజబాబును, అన్నయ్య కుమారుడు శ్రీనివాసరావులను తీవ్రంగా కొట్టి  బెదిరించారు.

శ్రీనివాసరావుకు, నిందితులకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరుగుతుండటంతో  శ్రీనివాసరావును మార్గంమధ్యలో కిందకు తోసేసి,  రాజబాబును బలవంతంగా గుంటూరు తీసుకువెళ్లిపోయారు. వాహనం ప్రధాన రహదారిలో  వెళితే రహదారులపై ఉండే సీసీ కెమెరాలలో రికార్డు అవుతుందని భావించిన నిందితులు కెమెరాలకు చిక్కకుండా గుంటూరు చేరినట్లు తెలిసింది.
 
సీపీని ఆశ్రయించిన ప్రేమజంట

 
తన తండ్రిని రాజబాబు, వరుసకు సోదరుడైన శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేసినట్లు తెలుసుకున్న కిరణ్  గౌతమితో కలిసి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసుల్ని ఆశ్రయించారు. ఆయన పోలీసుల్ని అప్రమత్తం చేసి కేసు నమోదు చేయించారు. మేజర్లయిన నూతన జంటకు రక్షణ కల్పించాలని ఆదేశించారు. పోలీసులు రంగంలోకి దిగారని తెలుసుకున్న నిందితులు రాజబాబును మంగళగిరి వద్ద గురువారం సాయంత్రం  తీసుకువచ్చి వదిలి వేశారు. ఆయన అక్కడ నుంచి తేలప్రోలు చేరుకున్నారు.
 
కులాంతర వివాహం చేసుకోవడం
 
వల్లనే కిడ్నాప్ :రాజబాబు

 తమ కుమారుడు కులాంతర వివాహం చేసుకోవటం వల్లనే కిడ్నాప్‌కు గురైనట్లు కిరణ్ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేలప్రోలు చేరుకున్న రాజబాబు తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ కుమారుడు ప్రేమించి వివాహం చేసుకున్న విషయం అమ్మాయి బంధువులకు తెలిపామన్నారు. గుంటూరు పోలీసులు ఇంటికి వచ్చి, తమను నమ్మించి సుమోలో  ఎక్కించుకుని తీసుకువెళ్ళారని తెలిపారు.

వాహనంలో తమను తీసుకువెళ్లుతూ పోలీసులు చిక్కకుండా ఉండేం దుకు సీసీ కెమెరాల్లో  నమోదు కాకుండా ఉండేం దుకు అడ్డదారుల్లో తీసుకువెళ్లాలని నిందితులు మాట్లాడుకున్నారని వివరించారు. గుంటూరు వెళ్లిన తరువాత తమ పిల్లను తమ వద్దకు పంపించాలని, లేకపోతే చంపేస్తామంటూ బెదిరించారని రాజబాబు పేర్కొన్నారు. గౌతమి  ఫిర్యాదు మేరకు  ఉంగుటూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement