నేపాలీ యువతిపై సామూహిక అత్యాచారం
- ఆటోలో కిడ్నాప్ చేసి అఘాయిత్యం
- ఆస్పత్రిలో బాధితురాలు
- నలుగురు కామాంధుల అరెస్ట్
బెంగళూరు : బెంగళూరు అపాయకరమైన నగర మేనని, మహిళలకు రక్షణ లేదని మరోసారి రుజువైంది. భర్తకు భోజనం ఇచ్చి తిరిగి వస్తున్న నేపాల్ యువతిపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన రామమూర్తినగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నేపాల్‌కు చెందిన 35 ఏళ్ల యువతి ఇక్కడి బౌరింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
నిందితులు నేపాల్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ గణేష్ (20), వంట మనిషి మహదేవ భట్ (24), సెక్యూరిటీగార్డులుగా పని చేస్తున్న సునీల్ (25), జగదీష్ (27)లను అరెస్ట్ చేసి వైద్య పరీక్షలకు తరలించామని సోమవారం డీసీపీ సతీష్ కుమార్ చెప్పా రు. ఆయన వివ రాల మేరకు... కల్కేరి మెయిన్ రోడ్డులోని బండే ప్రాంతంలో నేపాల్‌కు చెందిన దంపతులు నివాసం ఉంటున్నారు. బాధితురాలి భర్త సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్నాడు.
ఆదివారం మధ్యాహ్నం మహిళ భోజనం తీసుకుని భర్తకు అందజేసి తిరిగి ఇంటికి బయలుదేరింది. మార్గం మధ్యలో ఎన్‌ఆర్ కాలనీ సమీపంలోని నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ వద్ద సెక్యూరిటీ గార్డులు సునీల్, జగదీష్ మహిళ ఒంటరిగా వస్తుండటం చూసి ఆటోలో బలవంతంగా కిడ్నాప్ చేశారు. అక్కడి అపార్టుమెంట్ వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన గణేష్, మహదేవ భట్ కూడా అత్యాచారానికి ఒడిగొట్టారు.
అనంతరం రాత్రి మహిళను ఇంటి వద్ద దించేసి ఎవరికైనా విషయం చెబితే చంపేస్తామని బెదిరించారు. ఇంటి లోపలికి వెళ్లిన మహిళ భయంతో కుప్పకూలిపోయింది. మరోవైపు రక్తస్రావం కావ డంతో మెల్లగా ఆమె నుంచి అసలు విషయం రాబట్టాడు. అనంతరం దంపతులు రామమూర్తినగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితురాలిపై అత్యాచారం జరిగిందని వైద్యుల ప్రాథమిక చికిత్సలో వెలుగు చూసింది. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.