నేపాల్ యువతిని నిర్బంధించి రేప్ చేశారు! | nepal woman raped by security guard | Sakshi
Sakshi News home page

నేపాల్ యువతిని నిర్బంధించి రేప్ చేశారు!

Published Thu, Feb 4 2016 9:29 PM | Last Updated on Sat, Oct 20 2018 6:40 PM

nepal woman raped by security guard

బెంగళూరు(కర్ణాటక): ఉపాధి కోసం వచ్చిన నేపాల్ యువతిని ఓ సెక్యూరిటీ గార్డు నిర్బంధించి మూడు నెలలపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. బెంగళూరు నగరంలోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. బాధితురాలు అతడి బారి నుంచి తప్పించుకుని ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు నిందితుడైన సెక్యూరిటీ గార్డును అరెస్ట్ చేశారు.

రామ్‌సింగ్ అనే సెక్యూరిటీ గార్డు నేపాల్ రాజధాని కఠ్మాండ్‌లో తనకు తెలిసిన ఓ కుటుంబానికి చెందిన యువతిని ఉద్యోగం పేరుతో మూడు నెలల క్రితం నగరానికి పిలిపించాడు. అప్పటినుంచి ఆ యువతిని తన గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడేవాడు. విధులకు వెళ్లే సమయంలో గదికి తాళం వేసుకుని వెళ్లేవాడు. దీంతో యువతి నిస్సహాయురాలిగా ఉండిపోయింది. అయితే.. బుధవారం రాత్రి ఇంటి నుంచి తప్పించుకుని ఓ స్వచ్ఛంద సంస్థను ఆమె ఆశ్రయించింది. ఆ సంస్థ కార్యదర్శి యోగేశ్ బాధితురాలికి అండగా నిలిచారు. పోలీసులు ఆ యువతి నుంచి ఫిర్యాదు తీసుకుని, వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుణ్ని గురువారం అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement