ఖమ్మం: చిలికి చిలికి గాలి వానలా మారిన అత్తా కోడళ్ల మధ్య ఘర్షణ చివరకు అత్తమీద కోడలు కత్తిపీటతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచేలా చేసింది. శనివారం సాయంత్రం పట్టణంలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని 2వ వార్డు ఇల్లెందులపాడుకు చెందిన అత్త శివారపు లలితమ్మ, కోడలు మౌనికలు శనివారం సాయంత్రం గొడవపడ్డారు. ఈక్రమంలో ఇరువురు ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా ఆగ్రహంతో అత్తపై కోడలు కత్తిపీటతో తలమీద నరికింది. దీంతో లలితమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మానికి తరలించగా.. ఈ సంఘటన ఇల్లెందులపాడులో సంచలనంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment