అనంతపురం సెంట్రల్ : అనంతపురం సాయినగర్‌లో నివాసముంటున్న రామకృష్ణ, చిత్రలేఖ దంపతులు కుమార్తె లలిత(23) శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు రెండో పట్టణ పోలీసులు తెలిపారు. డిగ్రీ వరకు చదివిన ఆమె కొంతకాంగా మానసికంగా ఇబ్బందిపడేదని, ఈ క్రమంలో తన రూంలో ఉరేసుకుని తనువు చాలించిందన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.