నిజామాబాద్ జిల్లాలో గురువారం ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది.
భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లాలో గురువారం ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. భీమ్‌గల్ మండలం మెండోరా శివారులోని ఈర్లగుట్ట వద్ద దుండగులు గొంతుకోసి మహిళను అత్యంత కిరాతకంగా హతమార్చారు.
మృతురాలు కమ్మర్‌పల్లి మండలం మానాల గ్రామానికి చెందిన లలిత(35)గా పోలీసులు గుర్తించారు. లలిత గత నెల 12 వ తేదీ నుంచి కనపడటం లేదని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనాస్థలాన్ని డీఎస్పీ ఆకుల రాంరెడ్డి, సీఐ రమణారెడ్డి పరిశీలించారు.