డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లాలో వివాహిత దారుణ హత్యకు గురైంది. డిచ్‌పల్లి మండలం కమలాపూర్‌కు చెందిన స్వరూప(26)ను ఆమె ఇంట్లోనే ఉరివేసి చంపబడింది. ఆమె తలపై బలంగా కొట్టిన తర్వాత ఉరివేసినట్లు తెలుస్తోంది. స్వరూప తలపై పలు గాయాలున్నాయి.
ఆమె భర్త తేజావత్ సంతోషే ఈ పనికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. స్వరూపకు, సంతోష్‌కు 2011లో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల పాప ఉంది. 2012 లో సంతోష్, ఇందిర అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. 2013లో ఇందిరకు విడాకులిచ్చాడు. కొన్ని రోజులుగా మళ్లీ ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో స్వరూపను అడ్డు తొలగించుకోవడానికి సంతోష్ ఈ హత్యకు పాల్పడ్డాడని తెలుస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంతోష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డాగ్ స్వ్కాడ్ను తెప్పించి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.