వివాహిత దారుణ హత్య | Woman Murdered By Husband | Sakshi
Sakshi News home page

వివాహిత దారుణ హత్య

Nov 16 2023 9:08 AM | Updated on Nov 16 2023 9:08 AM

Woman Murdered By Husband - Sakshi

వివాహిత దారుణహత్యకు గురికాగా ఆమెను ఆస్తి కోసం భర్తే కడతేర్చినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటన మండ్య నగరం వి.వి. నగర లేఔట్‌లో జరిగింది.

కర్ణాటక: వివాహిత దారుణహత్యకు గురికాగా ఆమెను ఆస్తి కోసం భర్తే కడతేర్చినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటన మండ్య నగరం వి.వి. నగర లేఔట్‌లో జరిగింది.  మైసూరు హెబ్బాళ లేఔట్‌కు చెందిన పి.షణ్ముక స్వామి, రాజేశ్వరి దంపతుల కుమార్తె శ్రుతి(32)ని మండ్య వీవీ నగరలోని నాగరాజప్ప కుమారుడు టీఎన్‌ సోమశేఖర్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడాదిన్నరకు పైగా వీరి దాంపత్య జీవితం సుఖంగానే సాగింది. ఆ తర్వాత ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. 

 పలుమార్లు పెద్దలు రాజీ చేశారు. అయినా సోమశేఖర్‌ ప్రవర్తనలో మార్పు రాలేదు. మరో వైపు శ్రుతి తల్లిదండ్రులు, శ్రుతి చెల్లెలు సుషి్మతా కూడా ప్రమాదంలో మరణించింది. ఈ నేపథ్యంలో అన్ని ఆస్తులు శ్రుతిపేరిట మారాయి. శ్రుతి పేరిట మైసూరులోని విజయనగర ఒకటో లేఔట్‌లో మూడంతస్తుల ఇల్లు ఉంది. ఆస్తులపై ఆశ పెట్టుకున్న సోమశేఖర్‌.... వాటన్నింటిని తన పేరిట మార్చాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. అయితే సోమశేఖర్‌ డిమాండ్‌ను శ్రుతి తిరస్కరించింది.  

ఆస్తులన్నింటిని తన పిల్లల పేరు మీద మార్చేందుకు శ్రుతి నిర్ణయించింది.  ఈ నిర్ణయాన్ని సోమశేఖర్‌ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ క్రమంలో శ్రుతి దారుణహత్యకు గురైంది. శ్రుతి మరణంపై చిన్నాన్న పి.కుమారస్వామి అనుమానం వ్యక్తం చేస్తూ సోమశేఖర్, ఆమె అత్త నీలాంబిక, ఆడపడుచు హేమలతపై పశి్చమ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సోమశేఖర్‌ను అరెస్టు చేశారు. తానే శ్రుతిని హత్య చేసినట్లు సోమశేఖర్‌ అంగీకరించాడని పోలీసులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement