Karnataka: Woman Murdered By Husband - Sakshi
Sakshi News home page

ఏడాది క్రితమే పెళ్లి.. అంతలోనే దారుణం.. ప్రతీరోజూ దిండు కింద..

Published Mon, Jul 17 2023 7:43 AM | Last Updated on Wed, Jul 19 2023 7:21 PM

Woman Murdered By Husband - Sakshi

కర్ణాటక: పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగిరాక పోవడంతో కక్ష పెంచుకున్న భర్త ఆమెను హత్య చేశాడు. ఈ సంఘటన మైసూరు సిటీ కుంబార కొప్పలిలో చోటు చెసుకుంది. హర్షిత (21) హతురాలు కాగా, నిందితుడు వి.మాదేశ (30).  వివరాలు.. మండ్య జిల్లా పాండవపుర తాలూకాలోని చినకురళి కి చెందిన హర్షితను గుండ్లుపేటే తాలూకా బేరంబళ్లికి చెందిన మాదేశకు ఇచ్చి ఏడాది క్రితం  పెళ్లి జరిపించారు.

మొదట్లో ఇద్దరూ బాగానే ఉన్నారు, కానీ క్రమంగా గొడవలు మొదలయ్యాయి. మాదేశ పడుకునే సమయంలో పక్కన  కొడవలిని పెట్టుకునేవాడు. భర్త వైఖరిని తట్టుకోలేక భార్య అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్లిపోతే, బతిమాలి తీసుకొచ్చేవాడు.

ఇటీవల గలాటాలు పెరగడంతో ఆమె కుంబారకొప్పలిలోని పుట్టింటివద్దే ఉంటోంది. ఆదివారం వేటకొడవలి తీసుకుని వెళ్లిన మాదేశ భార్యను ఇంటికి రావాలని గొడవపడి నరికి చంపాడు. అడ్డు వచ్చిన అత్త గీత పైన దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. మేటిగళ్లి పోలీసులు మాదేశను అరెస్టు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement