వర్ని : దసరా పండుగను ఆనందంగా జరుపుకుందామని బంధువుల ఇం డ్లకు వెళ్తున్న వారిని ‘తుఫాన్’ వాహనం రూపంలో మృత్యువు కాటేసింది. గమ్య స్థానానికి చేరక ముందే వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వారి కుటుంబాలకు విధి విషాదాన్ని పంచింది. వర్ని మండలంలోని అక్బర్ నగర్ శివారులో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బా న్సువాడ మండలం కొల్లూరు సర్పంచ్ పల్లి కొండ మాధవి(35), కోటగిరి పోతంగల్ వార్డు సభ్యురాలు సూదం గంగామణి(36), వర్ని మండలం తగిలేపల్లికి చెందిన కృష్ణవేణి(32), అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
ఆస్పత్రికి తరలిస్తుండగా వడ్డేపల్లికి చెందిన బాలిక శ్వేత(11) మార్గ మధ్య లో మృతి చెందింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు రాజకీయంగా వివిధ పదవుల్లో కొనసాగుతున్నందు వల్ల ఆయా గ్రామాల్లో తీవ్ర కలకలం రేగింది. రోడ్డు ప్రమాదం మధ్యాహ్నం జరిగినప్పటికీ తగిలేపల్లికి చెందిన కృష్ణవేణిని తప్ప మిగిలిన మృతులెవరనేది రాత్రి వరకు తెలియరాలేదు. మృతి చెందిన వారు ముగ్గురు మహిళలే కావడంతో వారిని గుర్తించడంలో తీవ్ర జాప్యం జరిగింది.
తల్లిగారింట్లో పండుగ జరుపుకుందామని...
మృతురాలు కృష్ణవేణి తగిలేపల్లి గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు బండి బందెయ్య భార్య. ఈ ఏడాది దసరాను తల్లిగారింట్లో జరుపుకుందామని కుమారులైన అజేయ్, విజయ్‌లను పాఠశాలకు సెలవు ప్రకటించగానే.. బోధన్ మండలం బెలాల్‌కు పంపింది. భర్త బందెయ్యతో కలిసి వర్ని మండల కేంద్రానికి వచ్చి బోధన్ వె ళ్లేందుకు ఆటో ఎక్కింది. పది నిమిషాల్లోపే మృత్యు ఒడిలోకి జారిపోయింది. భర్త బందెయ్యకు తీవ్ర గాయాలు కాగా నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
జాతరకు వెళ్దామని..
విజయ దశమి సందర్భంగా కొండల్‌వాడిలో జరిగే జాతరకు వడ్డేపల్లికి చెందిన శ్వేత, ఆమె తల్లి లలిత బయలు దేరా రు. వీరు వర్ని క్రాసింగ్‌లో ఆటో ఎక్కారు. అంతలోనే ప్రమాదం సంభవించడంతో బోధన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నిజామాబాద్ తరలిస్తుం డగా.. మార్గ మధ్యంలో మృతి చెందింది. శ్వేత తల్లి లలిత పరిస్థితి విషమంగా ఉన్నందు వల్ల హైదరాబాద్‌లో చికిత్స పొందుతోంది. కూతురు చనిపోయింద నే విషయం కూడా ఇప్పటికీ కుటుంబ సభ్యులు లలితకు తెలియనివ్వలేదు. మృతురాలు శ్వేత చిన్నప్పటి నుంచి అ మ్మమ్మ హన్మవ్వ, తాత మల్కయ్యల వ ద్ద ఉంటోంది. స్థానిక విజయ విధ్యానికేతన్‌లో ఆరో తరగతి చదువుతోంది. చ దువులో ముందుండేదని, పాఠశాల నుం చి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం ముచ్చట్లు చెబుతుంటే తమకు ఎంతో ఆనందాన్ని కలిగించేదని... ఇప్పుడెవరు తమకు కబుర్లు చెబుతారని రోదించడం కలిచివేసింది.
విజయదశమి నాడు విషాదం
Published Sun, Oct 5 2014 2:12 AM | Last Updated on Sat, Sep 29 2018 5:52 PM
Advertisement
Advertisement