తనకున్న ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి అదశ్యమైన ఘటన హైదరాబాద్ నగరం చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది.
చిలకలగూడ: తనకున్న ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి అదశ్యమైన ఘటన హైదరాబాద్ నగరం చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలగూడ దూద్‌బావికి చెందిన ధనరాజ్, లలిత (27) భార్యాభర్తలు. వీరికి కిరణ్మయి (7), దివ్యశ్రీ (5), శాంతి (3) అనే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ధనరాజ్ పెయింటర్‌గా పనిచేస్తుండగా, లలిత పంజాగుట్టలోని కాల్‌సెంటర్ ఉద్యోగి. ముగ్గురు పిల్లలు, ఇంటిపనితోపాటు ఉద్యోగం చేయడం కష్టం కనుక ఉద్యోగం మానేయాలని ధనరాజ్ కోరాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య వివాదం కొనసాగుతుంది.
ఈ క్రమంలో ఈనెల 18వతేదీ ఉదయం 8 గంటలకు ముగ్గురు పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిన లలిత తిరిగి ఇంటికి చేరలేదు. సన్నిహితులు, బంధుమిత్రులతో పాటు కాల్‌సెంటర్ యాజమాన్యాన్ని వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో ధనరాజ్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, లలిత ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి కోరారు.