three children
-
ముగ్గురు బిడ్డల విధానానికి చైనా ఆమోదం
బీజింగ్: చైనాలో ముగ్గురు బిడ్డల విధానానికి చైనా జాతీయ అసెంబ్లీ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. దేశ జనాభాలో వస్తున్న మార్పులను గుర్తించిన చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ ముగ్గురు బిడ్డల విధానానికి పచ్చజండా ఊపింది. దేశంలో జనన రేటు విపరీతంగా క్షీణిస్తూ వస్తోన్న తరుణంలో రివైజ్డ్ పాపులేషన్ అండ్ ఫామిలీ ప్లానింగ్ లాకు ఎన్పీసీ(నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్)కు చెందిన స్టాండింగ్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. త్వరలో దీన్ని ఎన్పీసీలో చర్చకు పెట్టి అధికారికంగా అమలు చేస్తారు. ఈ చట్టం ప్రకారం చైనా దంపతులు ఎక్కువ మంది పిల్లలను కంటే వారికి ప్రభుత్వం ఆర్థిక, సామాజిక సాయం అందింస్తుంది. పెరిగిపోతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకొని చైనా యువత పిల్లలపై ఆసక్తి చూపడం లేదు. దీంతో జననాల రేటు బాగా తగ్గింది. ఈ పరిస్థితి చక్కదిద్దేందుకే కొత్త చట్టం తెచ్చారు. పిల్లల పెంపకం వల్ల అయ్యే అదనపు ఖర్చును భరించడంలో, వారి విద్యాభ్యాస వ్యయంలో ప్రభుత్వం తల్లిదండ్రులకు మద్దతునిస్తుంది. అలాగే వారి పన్నులు, బీమా పథకాలు, ఇల్లు, ఉపాధి అంశాల్లో కూడా అండగా నిలుస్తుంది. మేలో పాలక కమ్యూనిస్టు పార్టీ రెండు బిడ్డల విధానం నుంచి మూడు బిడ్డల విధానానికి ఆమోదం పలికింది. అనంతరం ఈ నిర్ణయంపై స్టాండింగ్ కమిటీ చర్చించింది. వికటించిన వన్ ఛైల్డ్ విధానం గతంలో చైనాలో విపరీతంగా జనాభా పెరగడంతో కచ్ఛితమైన జనాభా నియంత్రణను అవలంబించారు. వన్ ఛైల్డ్ విధానంతో క్రమంగా చైనా జనన రేటు తగ్గుతూ వచ్చింది. ఈ తరుగుదల ప్రమాదకర స్థాయికి చేరడంతో 2016లో ఇద్దరు పిల్లల విధానం తీసుకువచ్చారు. అయినా జనన రేటు తరుగుదల ఆశించినంతగా మెరుగుపడకపోవడం, మరోవైపు 60ఏళ్ల పైబడిన జనాభాలో వృద్ధి వేగమవడంతో తాజాగా ముగ్గురు పిల్లల విధానం తెచ్చారు. చైనాలో పిల్లల పెంపకం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. అందువల్ల ఎక్కువమంది ఒకరికి మించి పిల్లల కోసం యత్నించడం లేదు. దీన్ని చక్కదిద్దాలంటే దంపతులకు పుట్టే ప్రతి కొత్త బిడ్డకు ఏడాదికి దాదాపు పది లక్షల యువాన్లు ఇవ్వాలని ఆర్థికవేత్తలు ప్రభుత్వానికి సూచించారు. కొత్తగా తెచ్చిన ముగ్గురు పిల్లల విధానంతో కొంత మెరుగుదల ఉండొచ్చని, కానీ ప్రత్యక్ష నగదు సాయం లేకుండా ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. చైనాలో జనాభా తరుగుదల కారణంగా 2027 నాటికి జనాభా పరంగా చైనాను భారత్ దాటేస్తుందని ఐరాస అంచనా వేసింది. చైనా నిపుణులు సైతం 2027నుంచి చైనా జనాభాలో తరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. చైనా మహిళా జనాభాలో ఫెర్టిలిటీ రేటు సైతం వరుసగా పడిపోతూ వస్తోంది. 2025కు చైనా జనాభా వృద్ధిలో నెగిటివ్ గ్రోత్ ఉంటుందని చైనా పీపుల్స్ బ్యాంక్ సైతం అభిప్రాయపడింది. దీనివల్ల వినియోగ డిమాండ్ తగ్గిపోతుందని, ఇందుకునుణంగా విధాన నిర్ణయాలుండాలని సూచించింది. ప్రభుత్వం తన విధానాలు సమీక్షించుకోకపోతే 2050 నాటికి దేశంలో వృద్ధుల పరిరక్షణకు అమెరికా కన్నా ఎక్కువ వ్యయం చేయాల్సివస్తుందని హెచ్చరించింది. ప్రభుత్వ జోక్యం లేకపోతే జనాభా తరుగుదల తాలుకు ఆర్థిక విపరిణామాలను వెనక్కు తిప్పలేమని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ హెచ్చరికల ఫలితంగా ప్రభుత్వం క్రమంగా జనాభా విధానాలను సడలిస్తూ వస్తోంది. -
మూడో బిడ్డకూ చైనా ఓకే
బీజింగ్: దేశంలో జననాల రేటు పడితుండటంతో చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ విధానపరమైన కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే సంతానం విధానాన్ని దశాబ్దాలపాటు కఠినంగా అమలు చేయడంలో చైనాలో జనాభా పెరుగుదల క్షీణించింది. దీని కారణంగా తలెత్తే దుష్ఫలితాలపై ఆందోళనలు వెల్లువెత్తడంతో ఇద్దరు బిడ్డల్ని కనవచ్చంటూ 2016లో వెసులుబాటు కల్పించింది. పిల్లల్ని పెంచడం ఆర్థికంగా భారంగా మారడంతో చైనాలో చాలా మంది దంపతులు ఇద్దరు సంతానం కలిగి ఉండేందుకు సముఖంగా లేరు. దీంతో తాజాగా, మరో అడుగు ముందుకేసి దంపతులు ముగ్గురు పిల్లల్ని కలిగి ఉండేందుకు వీలు కల్పించింది. కొత్త గణాంకాల ప్రకారం.. వరుసగా నాలుగో ఏడాది కూడా జననాల రేటు అతితక్కువగా నమోదైంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా, రెండోఅతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాలో పనిచేయగలిగే వారి సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుండటంపై ప్రభుత్వ వర్గాల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో, దేశాధ్యక్షుడు, కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) అధినేత జిన్‌పింగ్..ఇప్పటి వరకు అనుసరించిన కుటుంబ నియంత్రణ విధానాన్ని పక్కనబెట్టి, దంపతులు మూడో బిడ్డను కూడా కలిగి ఉండేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ‘మూడో సంతానాన్ని కనాలనే దంపతులను చైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది’అని అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆధ్వర్యంలో జరిగిన సీపీసీ పొలిటికల్ బ్యూరో నిర్ణయించినట్లు అధికార వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. ఈ విధానం అమలుకు అవసరమైన ప్రోత్సాహక చర్యలతో చైనా జనాభా పెరుగుతుందని ఆ సమావేశం పేర్కొందని తెలిపింది. -
‘నాయనమ్మ’కు చేయూత
సాక్షి, కామారెడ్డి: తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు పిల్లలను పెంచేందుకు ఆ నాయనమ్మ పడుతున్న కష్టాలపై కలెక్టర్ శరత్ స్పందించారు. కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈనెల 15న ‘సాక్షి’ ఫ్యామిలీ పేజీలో ‘ముగ్గురు పిల్లలు.. నాయనమ్మ’ కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఇది చదివిన కలెక్టర్.. భిక్షాటన చేస్తూ పిల్లలను పెంచుతున్న నాయనమ్మ గంగవ్వ కష్టాలను తెలుసుకుని చలించిపోయారు. అధికారులతో వివరాలు సేకరించారు. బు ధవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా కుప్రియాల్ నుంచి గంగవ్వతో పాటు ఆమె మనవరాళ్లు చామంతి, వసంత, మనవడు శ్రీకాంత్‌ను తన చాంబర్‌కు పిలిపించుకుని మాట్లాడారు. (గంగవ్వను కదిలిస్తే కన్నీళ్లే..) కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇకపై భిక్షాటన చేయవద్దని గంగవ్వకు సూచించారు. తక్షణ సహాయంగా రూ. 50 వేలు ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. పెద్దమ్మా యి చామంతికి ఔట్సోర్సింగ్ కింద ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించారు. 9వ తర గతి చదువుతున్న వసంతను కేజీబీవీలో చేర్పించాలని, టెన్త్ చదువుతున్న శ్రీకాంత్‌ను వచ్చే సంవత్సరం గురుకుల కళాశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పూరిగుడిసెలో నివసిస్తున్న గంగవ్వకు డబు ల్ బెడ్రూం ఇల్లు కేటాయిస్తామన్నారు. కలెక్టర్ భరోసా ఇవ్వడంతో గంగవ్వ ఆ మె మనువడు, మనువరాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదుకున్న కలెక్టర్‌కు, తమ కష్టాలను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’కి రుణపడి ఉంటామని అన్నారు. -
ఒకే కాన్పులో.. ఇద్దరు బాబులు, ఒక పాప
సాక్షి, జగిత్యాల : జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన ప్రసవం జరిగింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన గర్భిణి శిరీష ముగ్గురు శిశువులకు జన్మనిచ్చారు. వీరిలో ఇద్దరు బాబులు, ఒక పాప ఉన్నారు. ప్రస్తుతం తల్లి, ముగ్గురు పిల్లల ఆరోగ్యంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. తొలి కాన్పులోనే శిరీష ముగ్గరు పిల్లలకు జన్మనివ్వడం పట్ల ఆమె భర్త మహేశ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
వెంటాడుతున్న ముగ్గురు పిల్లల గండం
సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక ఇప్పుడు స్థానిక సమరానికి గంటలు మోగుతున్నాయి. పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో పోటీచేయాలనుకుంటున్న ఔత్సాహికులను ముగ్గురు పిల్లల గండం వెంటాడుతోంది. సాక్షి, బాపట్ల: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నాయకుల ఆశలను ముగ్గురు పిల్లల గండం వెంటాడుతూనే ఉంది. స్థానిక సంస్థల్లో మూడంచెల వ్యవస్థలైన సర్పంచ్‌లు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లతోపాటు మున్సిపాలిటీల్లో పోటీచేసే అభ్యర్థులకు ముగ్గురు పిల్లల ఆటంకం అడ్డుగా మారిందనే ఆందోళన కొన్నేళ్లుగా పోటీ చేయాలనుకుంటున్న నాయకులకు ఇబ్బందిగా మారింది. 1995 మే 29వ తేదీ తరువాత నుంచి ముగ్గురు పిల్లలు ఉంటే స్థానిక సంస్థలకు పోటీ చేసేందుకు అనర్హులు. అదే 1995 మే 29కి ముందు ముగ్గురు పిల్లలు కాదు గదా ఎంత మంది ఉన్నా పట్టింపు లేదు. అందుకే స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు 1995 మే డెడ్‌లైన్‌గా మారిందనే ఆవేదన పోటీల్లో ఉండే ఔత్సాహికుల్లో వ్యక్తమవుతోంది. ఒకవేళ పోటీ చేయాలనుకున్నవారికి డెడ్‌లైన్ తర్వాత ముగ్గురు పిల్లలు ఉన్నా వారిలో ఒకరు అనుకోకుండా చనిపోతే మళ్లీ వారు పోటీకి అర్హులే. ఇద్దరు పిల్లలు ఉండి పోటీ చేసే సమయానికి భార్య గర్భిణిగా ఉన్నా భర్త అయినా, భార్య అయినా పోటీ చేయవచ్చు. స్థానిక సంస్థలపై మక్కువ తీరక కొంతమంది అత్యుత్సాహం చూపించి తమ ముగ్గురు పిల్లల్లో ఒకరిని బంధువులకు దత్తత ఇచ్చినట్లుగా చూపి తమకు ఇద్దరు పిల్లలే అని చెప్పుకుంటారు. కానీ దత్తత ఇచ్చినా దత్తత బిడ్డను కూడా మూడో బిడ్డగానే పరిగణించి పోటీకి అనర్హులుగానే అధికారులు పరిగణిస్తారు. మరికొంతమంది తమకు పుట్టిన ముగ్గురు పిల్లల్లో తెలివిగా ఒక బిడ్డను వేరే బంధువుల ఇంటి పేరుతో పేరు మార్చి వేరే వారి లెక్కలో పెంచుతారు. అప్పుడు అలా ఇంటి పేరు మార్చిన తరువాత ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులో తమ మూడో బిడ్డను వేరే ఇంటి పేరుతో చూపించి పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వివాదాస్పద సంఘటనలు కోర్టుకు వెళ్లి తేల్చుకునేసరికి అడ్డదారిలో తమ బిడ్డ ఇంటి పేరు మార్చి గెలిచిన వ్యక్తి పదవీ కాలం కూడా పూర్తి కావస్తుందనే నమ్మకంతో బరితెగించి ఇలా చేస్తుంటారనే విమర్శలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే సర్పంచ్ల పదవీకాలం పూర్తయి దాదాపు ఆరునెలలు పైనే అవుతోంది. మరో నెల రోజుల్లో మండల పరిషత్, జెడ్పీటీసీలు, ఎంపీటీలు, మున్సిపాల్టీ అభ్యర్థుల పదవీకాలం కూడా పూర్తికావస్తోంది. గుంటూరు జిల్లాలో 57 మండలాల్లోని పంచాయతీలు, మున్సిపాల్టీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నికల గడువు సమీపించటంతో ప్రస్తుతం ఆసక్తికరమైన విషయాలపై చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో ముగ్గురు పిల్లల గండం స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల్లో మళ్లీ చర్చకు తావిస్తోంది. స్వగ్రామంలో ఓటు ఉంటేనే పోటీకి అర్హులు ముగ్గురు పిల్లల గండాలను అధిగమించి ఆసక్తి కలిగిన అభ్యర్థులెవరైనా పోటీ చేయాలంటే తప్పనిసరిగా వారు పోటీ చేసే పంచా యతీలో ఓటరుగా వారి పేరు నమోదై ఉం డాలి. పోటీ చేయడంతోపాటు పోటీ చేసి న వారిని ప్రతిపాదించాలన్నా కూడా ప్రతిపాదించేవారికిఓటు హక్కు అదే గ్రామ పంచాయతీలో ఉండాలి. రేషన్ డీలర్లు పోటీకి అర్హులే... కొన్ని గ్రామాల్లో రేషన్ షాపుల డీలర్లుగా ఉన్న వారు ఎలా పోటీ చేస్తారంటూ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అలజడి రేగింది. ముగ్గురు పిల్లల జీవో ప్రకారం రేషన్‌షాపుల డీలర్లు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అంగన్వాడీ సిబ్బంది, నీటి వినియోగదారుల సంఘాల సభ్యులు పోటీ చేసేందుకు అనర్హులుగా చట్టం చెబుతోంది. స్వచ్ఛంద సంస్థలు, మత సంస్థల చైర్మన్లు, మతిస్థిమితం లేని వ్యక్తులు పోటీకి అనర్హులు. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటే వారిపై విధించిన శిక్షాకాలం ఐదేళ్లలోపు వారు పోటీ చేసేందుకు అనర్హులు.కోర్టు విధించిన శిక్షలపై స్టే, బెయిల్ తెచ్చుకున్నా పోటీకి అనర్హులే. ఉద్యోగులు పోటీ చేయాలంటే తమ ఉద్యోగాలకు రాజీనామా చేసిన తరువాత...దాన్ని ఆమోదించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంది. -
ముగ్గురు పిల్లలతో కలిసి కాల్వలోకి దూకిన మహిళ
-
ముగ్గురు చిట్టి తల్లుల వ్యథ
-
కలుషితాహారంతో ముగ్గురు చిన్నారుల మృతి
విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లా దుబ్రిగూడ మండలం ఒబియాగూడలో కలుషితాహారం తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలలు మృతిచెందారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం వెలుగుచూసింది. సత్తిబాబు(7), శంకర్(4), సింహాద్రి(3) అనే బాలలు శనివారం రాత్రి అన్నం తిని నిద్రపోయారు. ఉదయం చూసేసరికి ముగ్గురూ విగతజీవులై ఉన్నారు. వీరి తల్లిదండ్రులు కూడా అస్వస్థతకు గురయ్యారు. రాత్రి తిన్న ఆహారం కలుషితమై ఉంటుందని, అందువల్లే పిల్లలు మృతిచెందారని భావిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతిచెందడం, వారి తల్లిదండ్రులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇరుగుపొరుగువారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అస్వస్థతకు గురైనవారిని ఆస్పత్రికి తరలించారు. -
ఒకే కాన్పులో మూడు పిల్లలక జన్మనిచ్చిన పులి
-
చిన్నారులకు దారి దొరికింది
♦ చైల్డ్‌లైన్ సంస్థ సహకారంతో ♦ ముగ్గురు అమ్మాయిలకు హోంలో ఆశ్రయం ♦ ఆడ పిల్లలను సాకలేక పారిపోయిన తండ్రి ♦ తండ్రిని వెతికే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన తల్లి పటాన్చెరు టౌన్: హమ్మయ్య.. ఓ ముగ్గురు చిన్నారులకు దారి దొరికింది. ఆడపిల్లలై పుట్టిన పాపానికి రోడ్డున పడ్డారు. మూడు పూటలు తిండిపెట్టి, చదివించే వారు లేక అల్లాడిపోయారు. కన్నతండ్రి పారిపోగా.. తండ్రిని వెతికే క్రమంలో రోడ్డు ప్రమాదంలో కన్నతల్లి ప్రాణాలు విడిచింది. అనాథలుగా మారిన వీరు అమ్మమ్మ చెంతకు చేరారు. ఆర్థిక పరిస్థితి, అనారోగ్యం కారణంగా ఆమె వారిని సాకలేకపోయింది. ఈ క్రమంలో స్థానికుల సహకారం, కార్పెడ్-చైల్డ్‌లైన్ కృషితో చిన్నారులు ఎట్టకేలకు ఓ ఆశ్రమానికి చేరుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ఎన్కతల గ్రామానికి చెందిన సురేశ్, రేఖ దంపతులకు తేజశ్రీ(9), నవ్వశ్రీ(7), కృతిక(5) సంతానం. ఈ ముగ్గురు ఆడపిల్లలను పోషించడం తన వల్ల కాదంటూ తండ్రి సురేశ్ గత ఏడాది ఇంటి నుంచి పారిపోయాడు. చిన్నారుల తల్లి రేఖ తన తండ్రి రమేశ్‌తో కలసి సురేశ్ కోసం వెతికే పనిలో పడింది. ఈ క్రమంలో రేఖ, ఆమె తండ్రి రమేశ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటి నుంచి ఈ ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారి.. మెదక్ జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్‌లోని వారి అమ్మమ్మ రూపమ్మ వద్దకు చేరారు. ఆర్థిక పరిస్థితి, అనారోగ్యం, వయోభారం వంటి కారణాలతో రూపమ్మ తన మనవరాళ్లను పోషించలేకపోతుంది. ఆమె పరిస్థితిని గమనించిన స్థానికులు శ్రీను, రాజగోపాల్ విషయాన్ని.. సంగారెడ్డిలోని మహిళా శిశుసంక్షేమ శాఖ పరిధిలోని చైల్డ్ లైన్ సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సంస్థ డెరైక్టర్ ఎంఎస్ చంద్ర మూడు రోజుల క్రితం తన సిబ్బందిని ఇస్నాపూర్ పంపించారు. ఆ కుటుంబ పరిస్థితిని గమనించి సీడబ్ల్యూసీ సభ్యుల దృషి ్టకి తీసుకెళ్లారు. వాస్తవ పరిస్థితిని గమనించిన సంస్థ ప్రతినిధులు ఆ చిన్నారులను మంగళవారం అమీన్‌పూర్‌లోని మహిమ మినిస్ట్రీస్ హోంలో చేర్పించారు. -
బంధువుల చెరలో ఆ ముగ్గురు!
♦ రైల్వేకోడూరులో 10న ముగ్గురు పిల్లల అదృశ్యం ♦ తన పెద్ద కూతురును ఇవ్వనన్నందుకే కిడ్నాప్ చేశారంటున్న తండ్రి ♦ డోన్‌లో ఉంటున్న సోదరుడి భార్యపై అనుమానం ♦ ఎస్పీ ఆదేశాలతో కదిలిన పోలీసులు రైల్వేకోడూరు రూరల్ : రైల్వేకోడూరు పట్టణంలో ఈ నెల 10న అదృశ్యమైన ముగ్గురు పిల్లలు వారి బంధువుల చెరలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐదు రోజులుగా కనిపించని తమ పిల్లలను తమ వద్దకు చేర్చి న్యాయం చేయాలని పిల్లల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తొలుత పెద్దగా పట్టించుకోని పోలీసులు ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగారు. వివరాలు.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చంబల్ కాలనీ అంబమొరానా ప్రాంతానికి చెందిన షేక్ నజీర్ తన రెండవ భార్య సఖినా బేగంతో కలిసి రైల్వేకోడూరులోని శాంతినగర్‌లో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన నజీర్ లారీలో ఇతర ప్రాంతాలకు వెళితే రెండు మూడు రోజుల తర్వాత వచ్చేవాడు. వీరికి కూతరు హజ్రిన్ హుస్సేన్(8), కుమారులు హజరత్ హుస్సేన్(6), జమీర్ హుస్సేన్(3) ఉన్నారు. వీరు ఈ నెల 10వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఇంటి వెనుక ఆడుకుంటూ అదృశ్యమయ్యారు. ఆ రోజంతా అన్ని ప్రాంతాల్లో వెతికామని, బంధువులకు కూడా ఫోన్లు చేసి విచారించామని.. అయినా వారి ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు 11వ తేదీన ఫిర్యాదు చేశామని తల్లిదండ్రులు సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. ఎక్కడైనా ఆడుకోవడానికి వెళ్లి ఉంటారని, వెతకాలని పోలీసులు చెప్పారన్నారు. మీ పిల్లలు మహారాష్ట్రలో ఉన్నారంటూ అదే రోజు గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి (+917709855612) ఫోన్ వచ్చిందన్నారు. షేక్ నజీర్ మొదటి భార్య కూతురు నజరానా(18)ను డోన్‌లో ఉన్న గణేష్‌కు ఇచ్చి పెళ్లి చేస్తే సమస్య పరిష్కారమవుతుందని, లేదంటే చంపుతామని బెదిరించారన్నారు. దీంతో తాము జిల్లా ఎస్పీని కలిసి ఆదుకోవాలని కోరామన్నారు. ఆయన ఆదేశాలతో కోడూరు పోలీసుస్టేషనులో కేసు నమోదు చేశారన్నారు. నా సోదరుని భార్య షమీనా బేగం పనే ఇది.. భాధితులు మాట్లాడుతూ తమ పిల్లలను తీసుకెళ్లింది కర్నూలు జిల్లా డోన్‌లో ఉంటున్న తన సోదరుడు జాకీర్ హుస్సేన్ భార్య షమీనా బేగం అని అనుమానంగా ఉందని షేక్ నజీర్ చెప్పారు. వారి ఇంటికి పారిశుద్ధ్య కార్మికుడైన బినోద్ అగర్వాల్ అనే వ్యక్తి వచ్చి వెళ్తుండే వాడన్నారు. ఇదివరకు తాము వారి ఇంటికి వెళ్లినప్పుడు అతను తన కుమార్తె నజరానాను చూశాడని, అతని బావమరిది గణేష్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని కోరాడన్నారు. ఇందుకు తాము తిరస్కరించడంతో కక్ష గట్టిన బినోద్ అగర్వార్ తన సోదరుడి నలుగురు కుమారులను కిడ్నాప్ చేసినట్లు బంధువుల ద్వారా తెలిసిందన్నారు. నజరానాను తీసుకువస్తే వారి పిల్లలను వదిలేస్తానని బెదిరించడం వల్లే.. షమీనా తమ పిల్లలను ఎత్తుకెళ్లిందని అనుమానం వ్యక్తం చేశారు. షమీనా ఈ నెల 10న కోడూరుకు వచ్చి.. తన గురించి అడగ్గా, తాను లారీపై వెళ్లానని తన భార్య చెప్పిందన్నారు. ఇదే అదునుగా ఇంటి వెనుక ఆడుకుంటున్న పిల్లలను తీసుకెళ్లిందన్నారు. సోమవారం రాత్రి పోలీసులుతో కలిసి డోన్‌కు వెళుతున్నామని ఆయన తెలిపారు. తన మొదటి భార్య పప్పీ బేగం 11 ఏళ్ల క్రితం చనిపోయిందని, నజరానాను తన రెండవ భార్య సఖినా బేగం సొంత తల్లిలా చూసుకుంటోందన్నారు. మంచి అయ్య చేతిలో పెట్టాలని భావించడంతోనే తాము ఆ సంబంధాన్ని తిరస్కరించామని చెప్పారు. -
ముగ్గురు పిల్లలతో తల్లి అదృశ్యం
హైదరాబాద్ : ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి అదశ్యమైన ఘటన హైదరాబాద్ లోని చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలగూడ దూద్‌బావికి చెందిన ధనరాజ్, లలిత (27)లు భార్యాభర్తలు. వీరికి కిరణ్మయి (07), దివ్యశ్రీ (05), శాంతి (03) ముగ్గురు ఆడపిల్లలు. ధనరాజ్ పెయింటర్‌గా పనిచేస్తుండగా, లలిత పంజాగుట్టలోని కాల్‌సెంటర్ ఉద్యోగి. ముగ్గురు పిల్లలు, ఇంటిపనితోపాటు ఉద్యోగం చేయడం కష్టం కనుక ఉద్యోగం మానేయమని ధనరాజ్ కోరాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య వివాదం కొనసాగుతుంది. ఈక్రమంలో ఈనెల 18వతేది ఉదయం 8 గంటలకు ముగ్గురు పిల్లలను తీసుకుని బయటకు వెల్లిన లలిత తిరిగి ఇంటికి చేరలేదు. సన్నిహితులు, బంధుమిత్రులతోపాటు కాల్‌సెంటర్ యాజమాన్యాన్ని వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో ధనరాజ్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, లలిత ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ భాస్కర్‌రెడ్డి కోరారు. -
ముగ్గురు పిల్లలతో తల్లి ఆదృశ్యం
చిలకలగూడ: తనకున్న ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి అదశ్యమైన ఘటన హైదరాబాద్ నగరం చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఎస్ఐ భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలగూడ దూద్‌బావికి చెందిన ధనరాజ్, లలిత (27) భార్యాభర్తలు. వీరికి కిరణ్మయి (7), దివ్యశ్రీ (5), శాంతి (3) అనే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ధనరాజ్ పెయింటర్‌గా పనిచేస్తుండగా, లలిత పంజాగుట్టలోని కాల్‌సెంటర్ ఉద్యోగి. ముగ్గురు పిల్లలు, ఇంటిపనితోపాటు ఉద్యోగం చేయడం కష్టం కనుక ఉద్యోగం మానేయాలని ధనరాజ్ కోరాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈనెల 18వతేదీ ఉదయం 8 గంటలకు ముగ్గురు పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిన లలిత తిరిగి ఇంటికి చేరలేదు. సన్నిహితులు, బంధుమిత్రులతో పాటు కాల్‌సెంటర్ యాజమాన్యాన్ని వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో ధనరాజ్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, లలిత ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ భాస్కర్‌రెడ్డి కోరారు. -
ఫిలింనగర్లో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని ఫిలింనగర్ ప్రాంతంలో ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోయారంటూ గురువారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫిలింనగర్ పరిధిలోని బీజేఆర్నగర్ బస్తీకి చెందిన ఆర్.శివ(11) స్థానిక గీతాంజలి హైస్కూల్లో నాలుగో తరగతి, అలాగే దుర్గాప్రసాద్(14) ఎనిమిదో తరగతి చదువుతున్నారు. జ్ఞానీ జైల్‌సింగ్‌నగర్ బస్తీవాసి పవన్(14) స్థానిక వివేకానంద గ్రామర్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు. వీరు ముగ్గురూ స్నేహితులు. బుధవారం సాయంత్రం ఆడుకుంటామని బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. వీరి తల్లిదండ్రులు రాత్రంతా గాలించిన ఆచూకీ దొరకలేదు. దీంతో గురువారం ఉదయం తమ పిల్లలు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదుచేశారు. మిస్సింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలింపు చేపట్టారు. -
ఐదుగురిని బలిగొన్న క్షణికావేశం...
* ముగ్గురు పిల్లలను, భార్యను చంపి భర్త ఆత్మహత్య * అనాథలైన ముగ్గురు చిన్నారులు సాక్షి, బెంగళూరు : ఆర్థిక సమస్యలు... అటుపై ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతుల మధ్య మనస్పర్థలు కారణంగా క్షణికావేశంలో తీసుకున్న ఓ వ్యక్తి నిర్ణయం ఐదుగురిని బలితీసుకుంది. ముగ్గురు పిల్లలను అనాథలను చేసింది. ఈ హృదయ విదారక ఘటన బెంగళూరు శివారులోని జిగణి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు....తుమకూరు జిల్లా శిరాకు చెందిన ఫయాజ్ (35) ఉపాధి కోసం పదిహేడేళ్ల క్రితమే బెంగళూరుకు వచ్చాడు. పెయింటర్‌గా పనిచేసే ఫయాజ్‌కు బొమ్మనహళ్లి సమీపంలోని బేగూరు వద్ద ఉంటున్న కవితా అలియాస్ రేష్మా (30) పరిచయమైంది. పరిచయం ప్రేమకు దారితీసి పెద్దలను ఎదురించి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరుగురు సంతానం. మొదట్లో వచ్చిన సంపాదనతో కుటుంబం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతుండేది. అయితే సంతానం పెరడగంతో వచ్చిన ఆదాయం కుటుంబ పోషణకు సరిపోక ఫయాజ్ ఇబ్బందులు పడేవాడు. ఈ విషయాన్నే సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధపడేవాడు. మరోవైపు భార్యభర్తల మధ్య ఇటీవల మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఇదిలా ఉండగా నాలుగు రోజుల ముందు ఫయాజ్ బెంగళూరు నుంచి మంచేనహళ్లికి మకాం మార్చాడు. శనివారం దంపతుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. పనిపై బయటికి వెళ్లి రాత్రి ఫయాజ్ ఇంటికి చేరుకున్నాడు. భార్య పిల్లలు మహబూబ్ (5), ఉసాద్ (2), సాదల్ (11 నెలలు) నిద్రపోతూ కనిపించారు. అంతే క్షణికావేశంతో ఇంటి తలుపులు వేసి ముగ్గురిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. కొద్ది సేపటి తర్వాత ఇంటి నుంచి పొగలు రావడంతో చుట్టపక్కల వారు ఇంటి తలపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లే సరికి చేతిలో కత్తితో ఉన్న ఫయాజ్ గొంతు కోసుకున్నాడు. హుటాహుటిన బాధితులను ఆసుపత్రికి చేర్చగా అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మరో ముగ్గురు పిల్లలు సంఘటన జరిగిన సమయంలో పక్కన ఉన్న ఇంటికి వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, భార్య, పిల్లలకు నిప్పంటించినప్పుడు వారు అరుపులు ఎందుకు బయటికి వినిపించలేదు అన్న దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. కిరోసిన్ లేదా మంటలు పుట్టించే మరో ద్రావకం ఏదైనా ఉపయోగించాడే అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నలుగురికి 80 బాటిళ్ల పాలు...
సారా.. ఒక సూపర్ మామ్..! ట్రిప్లెట్స్.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుడితే వాళ్లను ట్రిప్లెట్గా వ్యవహరిస్తారు. అత్యంత అరుదుగా మాత్రమే జరుగుతుందిలా.. ఎనిమిది వేల మందిలో ఒక అమ్మ మాత్రమే ట్రిప్లెట్స్‌కు జన్మనిస్తుందని వైద్యుల అంచనా. అయితే ఈ తల్లికి అలా పుట్టిన ముగ్గురూ ఆరోగ్యంగా ఉండటం, ఉండవలసినంత బరువుతో ఉండటం విశేషం. పది నెలల వ్యవధిలో రెండు కాన్పుల్లో నలుగురు పిల్లలు పుట్టినా తల్లీ పిల్లలూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. బ్రిటన్‌కు చెందిన సారావార్డ్కు తొలుత ఒక బాబు పుట్టాడు. ఆ తర్వాత వెంటనే గర్భం ధరించిన ఆమె ట్రిప్లెట్స్‌కు జన్మనిచ్చింది. ఇప్పుడు ఆమె పిల్లల పెంపకం అందరికీ ఆసక్తికరంగా మారింది. ఏడాది వయసులోపు పిల్లలు నలుగురిని ఆమె ఎలా చూసుకోగలుగుతోంది... ఆమెకు ఏమీ కష్టం కావడం లేదా?! అని అనేకమంది ఆరాలు తీస్తుండడంతో సారావార్డ్ పిల్లల పెంపకం మీడియాకు ఆసక్తికరంగా మారింది. దీంతో ఆమె నలుగురు పిల్లలను ఆడించడం దగ్గర నుంచి నిద్రపుచ్చడం వరకూ ప్రతిదీ ఒక పాఠమే అవుతోంది. మన దగ్గర కూడా ప్రస్తుత కుటుంబ వ్యవస్థల్లో.. భార్యాభర్త ఉద్యోగం చేయాల్సిన పరిస్థితుల మధ్య పిల్లల పెంపకం చాలా కష్టమైన అంశమే అవుతోంది. తోడుగా ఉండి చూసుకొనే పెద్దవాళ్లు ఉంటే ఫరవాలేదు కానీ.. లేకపోతే ఆ దంపతుల ఇబ్బందులు చెప్పనలవి కాదు. వారికి వారానికి 175 సార్లు న్యాపీలు మార్చాల్సి ఉంటుందట, ఒక్కొక్కరికి 20 బాటిళ్ల చొప్పున వారంలో నలుగురికీ కలిసి 80 బాటిళ్ల పాలు పట్టించాల్సి ఉంటుంది. ఇక నెలల పాపాయిల ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ ఉంచాలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాత్రిపూట ఎవరో ఒకరు ఆరున్నొక్క రాగం అందుకొన్నారంటే... అది కూడా ఒకరి తర్వాత మరొకరు మొదలెట్టారంటే... ఆ రాత్రి సారా దంపతులకు జాగారమే. భర్త ఆఫీసుకు వెళ్లాక సారా ఇంట్లో ఒక్కతే ఉంటుంది. పిల్లలు మేలుకుని ఉంటే కనీసం వాష్‌రూమ్‌కు వెళ్లే పరిస్థితి కూడా ఉండదంటే ఆ తల్లి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంత శ్రమ ఉన్నా.. నలుగురు పిల్లలూ ఒక్కసారి నవ్వులు రువ్వుతూ కనిపిస్తే తన ఇబ్బందులేమీ గుర్తురావనీ, వారి బోసి నవ్వుల కోసం ఏమైనా చేయవచ్చనిపిస్తుందని సగటు అమ్మలానే చెప్పే సారా కచ్చితంగా సూపర్‌మామ్ కదా! -
భార్య ఉండగానే మరో రెండు వివాహాలు
సంతబొమ్మాళి: భార్య, ముగ్గురు పిల్లలు ఉండగానే మరో ఇద్దరు యువతులను రహస్యంగా వివాహాలు చేసుకుని దర్జా వలగ బోస్తున్నాడో ప్రబుద్ధుడు. సంతబొమ్మాళి మండలం పెద్దకేశనాయుడుపేట (పలికిలివానిపేట) గ్రామానికి చెందినన అతడి పేరు పలికిలి కర్రెన్న. అతడి మొదటి భార్య భగవతమ్మ శనివారం విలేకరులకు భర్త నిర్వా కాన్ని వివరించింది. టెక్కలి మండలం భగీరథపేటకు చెందిన పిన్నింటి రాజారావు కుమార్తె భగవతమ్మకు సంతబొమ్మాళి మండలం పెద్దకేశనాయుడుపేటకు చెందిన కర్రెన్నతో 1994లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. రూ.40 నగదు, తులంన్నర బంగారం, ఇతర వస్తువులను కట్నంగా ఇచ్చారు. ఈ దంపతులకు 1996లో రాణి అనే ఆడ బిడ్డ పుట్టింది. అప్పటి నుంచి కర్రెన్న భార్య భగవతమ్మకు శారీరకంగా, మానసికంగా వేధించసాగాడు. దీంతో ఆమె 1999లో భగీరథపేటలోని పుట్టినింటికి వెళ్లిపోయింది. భార్యకు తెలియకుండా 2002లో బెంగళూరు వలస వెళ్లి మూడేళ్లు అక్కడే ఉన్న కర్రెన్న అక్కడ వేరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమెతో కలిసి 2005లో స్వగ్రామమైన పెద్దకేశనాయుడుపేట వ చ్చాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య భగవతమ్మ భర్తను నిలదీసింది. పెద్దల సమక్షంలో ఒక అంగీకారానికి వచ్చిన కర్రెన్న ఇరువురితో కాపురం చేస్తానని అంగీకరించాడు. ఎనిమిది నెలలు గడచిన తర్వాత బెంగళూరు నుంచి రెండో భార్య తల్లిదండ్రులు వచ్చి తమ కుమార్తెను తీసుకు వెళ్లిపోయారు. దీంతో అతడి కాపురం మొదటి భార్యతో కొంతకాలం సాఫీగా సాగింది. ఆ దంపతులకు 2007లో మోహిని అనే కుమార్తె, 2010లో మణి అనే కుమారుడు పుట్టారు. ఆ తర్వాత తరచూ కర్రెన్న భార్యను కొట్టేవాడు. పెద్దలు రాజీ చేసి కాపురానికి పంపేవారు. ఇలా పలుమార్లు జరగడంతో పుట్టింటి వద్దే పిల్లలతో భగవతమ్మ ఉండిపోయింది. దీంతో కర్రెన్న ఈ ఏడాది మేలో తిప్పానబొడ్డపాడుకు చెందిన నీలాపు జ్యోతిని రహస్యంగా వివాహం చేసుకుని వేరొక చోట కాపురం పెట్టాడు. ఇటీవల మూడో భార్య జ్యోతిని స్వగ్రామం పెద్దకేశనాయుడుపేటకు తీసుకు రావడంతో మొదటి భార్య భగవతమ్మ ఇదేం పద్ధతని భర్తను నిలదీసింది. అయినా ఫలితం లేకపోవడంతో ఆమె నౌపడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు జూన్‌లో సిద్ధపడింది. పెద్దలు జోక్యం చేసుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఇప్పటి వరకు ఆగిపోయింది. ఇంత వరకు న్యాయం జరగకపోవడంతో శనివారం నౌపడ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమకు న్యాయం చేయాలని తన భర్తపైన, అత్తపైన,మూడో వివాహానికి సహకరించిన వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని కోరింది. న్యాయం చేయండి సారూ... నౌపడ పోలీస్‌స్టేషన్ పరిశీలనకు వచ్చిన ఎస్పీ ఎ.కె.ఖాన్‌కు న్యాయం చేయాలని బాధితురాలు భగవతమ్మ వేడుకుంది. వెంటనే ఎస్పీ స్పందించి భారాభర్తలను రప్పించి కౌన్సెలింగ్ ఇచ్చి న్యాయం జరిగేలా చూడాలని ఎస్సైకు సూచించారు. -
యూఎస్‌లో కాల్పులు: ఐదుగురు మృతి
యూఎస్‌లోని హ్యూస్టన్ శివారు ప్రాంతం బుధవారం తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. హ్యూస్టన్ శివారులోని స్ప్రింగ్ ప్రాంతంలోని నివాసాలపై కాల్పులు జరపడంతో ఐదుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. క్షతగాత్రులలో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు పెద్దవారు ఉన్నారని చెప్పింది. వారి ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. దీంతో వారిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పింది. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకపోయింది. నిందితుడి కోసం గాలింపు చర్యలు పోలీసులు ముమ్మరం చేశారని మీడియా పేర్కొంది. -
ముగ్గురు ఐఏఎస్‌ల తల్లి.. చదివింది ఎనిమిదే!!
మాయాదేవి.. ఆమె చదివింది కేవలం 8వ తరగతి వరకు మాత్రమే. కానీ తండ్రిలేని ముగ్గురు బిడ్డలను ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దింది. బిడ్డల తండ్రి ఓ సామాన్య రైతు. ఆయన కూడా పిల్లలు చిన్నవాళ్లుగా ఉండగానే మరణించాడు. అయినా.. ఆ తల్లికి మాత్రం తన బిడ్డలను ఐఏఎస్ అధికారులుగా చూడాలన్న తపన ఏమాత్రం తగ్గలేదు. ఉన్న ముగ్గురు బిడ్డల్లో ఎవరో ఒకరిద్దరిని కాదు.. మొత్తం ముగ్గురినీ ఆ స్థాయిలోనే చూడాలని గట్టిగా పట్టుబట్టింది. ఎంతగా అంటే, పెద్ద కూతురు ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతుండగానే ఆమె ఆ నిర్ణయం తీసుకుంది. ఎక్కడో రాజస్థాన్‌లోని మారుమూల గ్రామంలో నివాసం ఉండే మాయాదేవి.. జీవితంలో తాను ఎంత కష్టాలు పడినా.. తన బిడ్డలను మాత్రం ఉన్నత విద్య కోసం ఢిల్లీకి పంపింది. ఇప్పుడు ఆమె ప్రపంచంలోనే తనంత అదృష్టవంతురాలు, సంతోషకరమైన తల్లి మరొకరు లేరని భావిస్తోంది. ఆమె పెద్దకుమార్తె క్రాంతి ఇప్పటికే యూపీఎస్సీ పరీక్షలు పాసై.. ముంబైలో ఆదాయపన్ను శాఖ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడు కుమారుడు లోక్‌బంధు, రెండో కుమార్తె పూజ కూడా తాజాగా యూపీఎస్సీ విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణులయ్యారు. దీంతో తాను కన్న కలలు నిజమయ్యాయని, బిడ్డలు ముగ్గురూ ఉన్నత స్థానాల్లో నిలవడం ఆనందంగా ఉందని ఆమె చెబుతోంది. -
ముగ్గురు చిన్నారులను చంపిన నిందితుడి ఆత్మహత్య
ముగ్గురు చిన్నారుల సజీవదహనం కేసు భైంసా/బాసర, న్యూస్‌లైన్: ముగ్గురు చిన్నారులను అతి కిరాతకంగా చంపేసిన మానవ మృగం నరేందర్‌రెడ్డి(36) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా బాసర గోదావరి నదిలోని రెండో స్నానఘట్టాల వద్ద అతని మృతదేహం నీటిలో తేలుతూ కనిపించింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం దూపల్లికి చెందిన చిన్నారులు సిరి, అక్షర, ఖుషీలను నరేందర్‌రెడ్డి గురువారం సజీవ దహనం చేసిన విషయం తెలిసిందే. అదే రోజు నిందితుడు ఆదిలాబాద్ జిల్లా బాసర సమీపంలోని గోదావరి వద్దకు వచ్చినట్లు గుర్తించారు. నిజామాబాద్ ఎస్పీ తరుణ్‌జోషి, డీఎస్పీ అనిల్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని జేబులోని మూడు ఏటీఎం కార్డులను, ద్విచక్రవాహనం తాళం చెవిని, కారు తాళం చెవి, జేబులోని పర్సు, అందులో ఉన్న రూ.650 నగదును స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని ముథోల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
క్వారీలో పడి ముగ్గురు చిన్నారుల మృతి
-
అగ్నిప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి
అనంతపురం, న్యూస్‌లైన్ : మండుతున్న పొయ్యిపై పెట్రోలు క్యాన్ పడడంతో ఇంటికి నిప్పంటుకుని ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. అనంతపురం పాతూరులోని రాణినగర్లో బుధవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముండే బ్రహ్మయ్య, గంగమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ముత్యాలమ్మ, వెంకటలక్ష్మి, సరస్వతి. వీరిలో ఇద్దరు తమ పిల్లలతో పుట్టింట్లో ఉన్నారు. బ్రహ్మయ్య దంపతులు కూలి పనులకు వెళ్తుండగా, మిగతా కుటుంబ సభ్యులు లూజుగా పెట్రోలు విక్రయిస్తున్నారు. కట్టెల పొయ్యిపై వంట చేస్తుండగా, పిల్లలు ఆడుకుంటూ అరుగుపై ఉన్న పెట్రోలు క్యాన్‌ను కిందకు నెట్టేశారు. అది మండుతున్న పొయ్యిపై పడడంతో క్షణాల్లో అగ్ని కీలలు ఇల్లంతా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ముత్యాలమ్మ, ఆమె కూతురు జ్యోతి (8), శ్యామ (5), 11 నెలల మగ శిశువు, వెంకటలక్ష్మి, ఆమె కుమారుడు నందకిషోర్ (1) తీవ్రంగా గాయపడగా, సరస్వతికి స్వల్ప గాయాలయ్యాయి. 11 నెలల చిన్నారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, మిగిలిన వారిని కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో జ్యోతి, శ్యామ, నందకిషోర్ మృతి చెందారు. సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ క్షతగాత్రులను పరామర్శించారు.