mother missing
-
ఖమ్మంలో విచిత్ర ఘటన.. రెండేళ్ల తర్వాత సోషల్ మీడియాలో ప్రత్యక్షం..
సాక్షి, ఖమ్మం జిల్లా: రెండేళ్ల క్రితం అదృశ్యమైన తల్లి చనిపోయిందనుకొని కర్మకాండలు పూర్తి చేశారు ఆమె కుటుంబ సభ్యులు. తిరిగి ప్రత్యక్షం కావడంతో కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఈ విచిత్ర ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పుల్లూరు మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన నాగేంద్రమ్మ-తిరపతయ్య దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి జీవనం సాగిస్తున్నారు. నాగేంద్రమ్మకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో రెండు సంవత్సరాల క్రితం ఇంటి నుండి అదృశ్యమైంది. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా సమాచారం దొరకకపోవడంతో పత్రికల్లోనూ, టీవీలోనూ ఆమె ఆచూకీ కోసం వెతక సాగారు. ఆమె వివరాల కోసం వెతికే సమయంలో సమీప ప్రాంతంలో కొండమీద ఒక మహిళను హత్య చేసిన సంఘటన జరిగింది. హత్యగావించబడ్డ మహిళ ఆధారాలు లభించకపోవడంతో మతిస్థిమితం లేక తప్పిపోయిన నాగేంద్రమ్మనే ఆ మహిళగా భావించి ఆమె కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేసి గత్యంతరం లేని పరిస్థితిలో కర్మకాండలు కూడా పూర్తి చేశారు. తిరిగి రెండు సంవత్సరాల తర్వాత ఆమె కుమారుడు సోషల్ మీడియాలో కన్న తల్లిని గుర్తించిన కుమారుడు కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేశాడు. ఖమ్మం జిల్లా మధిరలో ఆర్కే ఫౌండేషన్ అనాథా శ్రమంలో ఉన్నట్టు ఆ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. తప్పిపోయిన నాగేంద్రమ్మనే ఆ మహిళగా గుర్తుపట్టారు. వెంటనే కుటుంబ సభ్యులు నాగేంద్రమ్మను అనాథాశ్రమంలో కలుసుకొని సంతోషం వ్యక్తం చేశారు. మధిర పోలీసులను సంప్రదించారు. సరైన ఆధారాలు ఉండటంతో మహిళను వారి బంధువుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
కొడుకు చెంతకు చేర్చిన వాట్సాప్
కేసముద్రం: హైదరాబాద్‌లోని ఓ కోళ్లఫామ్‌లో పనిచేస్తున్న కొడుకు వద్ద ఉంటున్న తల్లి 9 రోజుల క్రితం తప్పిపోయింది. ఓ సామాజిక కార్యకర్త ఆమెను చేరదీసి అడ్రస్‌ను వాట్సాప్ గ్రూప్‌ల్లో షేర్ చేయడంతో సమాచారం కేసముద్రానికి చేరింది. తల్లి ఆచూకీ తెలుసుకున్న కొడుకు ఆమె వద్దకు చేరుకుని కన్నీటిపర్యంతమైన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లి గ్రామానికి చెందిన మాంకాల యాకయ్య కొంతకాలంగా హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్ పరిధి గండిచెరువులో గల కోళ్లఫామ్‌లో పనిచేస్తున్నాడు. కొడుకు వద్దే ఉంటున్న తల్లి కొమురమ్మ 9 రోజుల క్రితం బస్సు ఎక్కి తప్పిపోయింది. ఎక్కడ వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు. తల్లి, కొడుకుతో జంగయ్య ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా మంచాల మండలం దాద్‌పల్లి గ్రామానికి ఆదివారం చేరుకున్న కొమురమ్మ, తన పరిస్థితిని పలువురుకి చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇది గమనించిన అదే గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త చెరుకూరి జంగయ్య ఆమె పూర్తి వివరాలను అడిగితెలుసుకున్నాడు. ఆకలితో ఉన్న కొమురమ్మకు భోజనం పెట్టాడు. ఆమె తెలిపిన వివరాలను వెంటనే వాట్సాప్, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ సమాచారం తిరిగితిరిగి కేసముద్రం గ్రూపులకు చేరింది. దీంతో సమీప బంధువులు కొమురమ్మ వివరాలను కొడుకు యాకయ్యకు ఫోన్ ద్వారా తెలిపారు. వెంటనే అతడు తల్లి ఉన్నచోటుకు చేరుకున్నాడు. తప్పిపోయిన తల్లిని 9రోజుల తర్వాత చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆమె సైతం కొడుకును చూసి భావోధ్వేగానికి గురైంది. తన తల్లిని చేరదీసిన జంగయ్యకు యాకయ్య కృతజ్ఞతలు తెలిపాడు. వాట్పాప్ ద్వారా సమాచారం షేర్ చేసిన గంటల వ్యవధిలోనే తల్లీకొడుకులు కలుసుకోవడంతో అంతా ఆనందం వ్యక్తం చేశారు. -
పదేళ్లకు చేరిన తల్లి.. దుఃఖాన్ని ఆపుకోలేక కుమారుడు
భద్రాచలం: మతిస్థిమితం కోల్పోయిన ఓ మహిళ పదేళ్ల తర్వాత కొడుకు చెంతకు చేరింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళ భద్రాచలంలో రోడ్లు, డివైడర్ల మీద నివాసం ఉంటూ కాలం వెళ్లదీసేది. పదేళ్లుగా ఇలా జీవనం సాగిస్తున్న ఆమెపై పత్రికల్లో వచ్చిన కథనాలను చూసి ఖమ్మంకు చెందిన అన్నం ఫౌండేషన్ చైర్మన్, పారా లీగల్ వలంటీర్ డాక్టర్ అన్నం శ్రీనివాస్‌రావు చేరదీసి 2019లో ఖమ్మంలోని తన ఆశ్రమంలో చేర్పించారు. వసతితోపాటు చికిత్స అందించారు. ఆమె పరిస్థితి మెరుగైన తర్వాత కుటుంబ నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. తన పేరు శాంతిదేవి అని, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాంద్రా జిల్లా అర్బయ గ్రామమని తెలిపింది. దీంతో శ్రీనివాస్‌రావు ఇంటర్నెట్ ద్వారా ఆ గ్రామ సమాచారం తెలుసుకొని అక్కడి పోలీసులకు వివరాలందించారు. పెద్ద కొడుకు దినేశ్ ఆచూకీ తెలుసుకొని తల్లికి వీడియో కాల్ చేయించారు. ఆమె తన తల్లి అని దినేశ్ ధ్రువీకరించాడు. దీంతో శ్రీనివాసరావు.. శాంతిదేవిని శుక్రవారం భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్ ఆధ్వర్యంలో దినేశ్‌కు అప్పగించారు. తల్లిని స్వగ్రామానికి తీసుకెళ్లాడు. చదవండి: వినూత్నం.. ఎంపీ, ఎమ్మెల్సీ గుర్రమెక్కి మరీ.. చదవండి: తెలంగాణ ఆదర్శం: వాయువేగాన ఆక్సిజన్ -
నలుగురు పిల్లలతో తల్లి అదృశ్యం
చాంద్రాయణగుట్ట: ఇంట్లో గొడవ పడిన ఓ గృహిణి నలుగురు పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ రుద్ర భాస్కర్ కథనం ప్రకారం....నర్కీపూల్‌బాగ్‌కు చెందిన మహ్మద్ అక్బర్, షైనాజ్ బేగం (35) దంపతులు. వీరికి అఫ్రీన్ (13), రెహ్మత్ బేగం (11), మహ్మదా బేగం (9), మహ్మద్ రిజ్వాన్ (8) సంతానం. కాగా ఈ నెల 13న ఉదయం 10 గంటలకు షైనాజ్ బేగం అత్తతో గొడవపడింది. కొద్దిసేపటికే ఇంట్లో వారికి చెప్పకుండా తన నలుగురు పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాత్రి వరకు కూడా తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు వారి కోసం పలుచోట్ల గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో భర్త అక్బర్ చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి ఆచూకీ తెలిసిన వారు చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో లేదా.. నం. 9490616823కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. -
ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యం
మియాపూర్: ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... మియాపూర్‌లోని ఓంకార్ నగర్లో కాలేమ్ హుస్సేన్, కాలేమ్ జయ భార్యాభర్తలు. తమ పిల్లలు కూతురు స్వప్న(11), కుమారుడు శిరీష(7), ఇషాన్(8)తో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఇద్దరూ కూలీపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇంట్లో చెప్పకుండా జయ తన ముగ్గురు పిల్లలను తీసుకొని వెళ్లి పోయింది. రాత్రి అయినా తిరిగి ఇంటికి రాలేదు. భర్త హుస్సేన్ పరిసర ప్రాంతాలు, బంధువుల ఇళ్లల్లో వాకబు చేసినా ఆచూకీ లభ్యం కాలేదు. ఆందోళన చెందిన భర్త మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త మందలించాడని..
మీర్‌పేట: భర్త మందలించాడని ముగ్గురు పిల్లలతో సహా ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా, దేవరకొండకు చెందిన నేనావత్ శ్రీను నగరానికి వలసవచ్చి నందనవనం వాంబేకాలనీలో భార్య విజయ (35), పిల్లలు నిఖిల్ (16), వైశాలి (13), మహేష్‌లాల్ (11)లతో కలిసి ఉంటూ విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. విజయ తరచూ ఫోన్లో మాట్లాడుతుండటాన్ని గుర్తించిన శ్రీనునామెను మందలించాడు. దీంతో మనస్తాపానికిలోనైన విజయనీ నెల 2న ముగ్గురు పిల్లలతో కలిసి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగిరాలేదు. ఆందోళనకు గురైన శ్రీను బంధువులు, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో బుధవారం మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు పిల్లలు సహా తల్లి అదృశ్యం
మీర్‌పేట: ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ అనంతరాములు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బడంగ్‌పేట శ్రీ సాయినగర్ కాలనీకి చెందిన మేకల శంకర్ ఇంట్లో నరపాక జగదీష్ భార్య శ్యామల (36), కుమారులు సందీప్ (5), లిఖిత్ (4)లతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. జూన్ 28న జగదీష్ ఇంట్లో లేని సమయంలో శ్యామల ఇద్దరు పిల్లలతో సహా బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం బంధువుల ఇలళ్లు, ఇతర ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో జగదీష్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా వారి ఇంటి యజమాని కుమారుడు మేకల శివకుమార్ (21) కూడా కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం
మియాపూర్: ఇద్దరు పిల్లలతో సహా ఓ మహిళ అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చందానగర్ వేమకుంటలో ఉంటున్న అనిల్‌కుమార్ అతని భార్య నల్ల అనూష(27) మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం అనూష తన కుమారుడు రుషి (6), కుమార్తె రేణు(4)తో సహా ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె భర్త అనిల్‌కుమార్ బంధువులు, చుట్టు పక్కల గాలించినా ఆచూకీ లభించకపోవడంతో చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కుమారుడితో సహా తల్లి అదృశ్యం
బంజారాహిల్స్: కుమారుడితో సహా ఓ మహిళ అదృశ్యమైన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సుధీర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెంకటగిరి ప్రాంతానికి చెందిన బాలు డ్రైవర్‌గా పని చేసేవాడు. గత నెల 30న అతడికి భార్య నీలాతో గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికిలోనైన నీలా కుమారుడు హర్షవర్ధన్ నాయక్(8)తో సహా బయటికి వెళ్లి తిరిగిరాలేదు. దీంతో ఆందోళన చెందిన బాలు పరిసరాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆచూకీ తెలిసిన వారు 9703900452 నంబర్లో సంప్రదించాలని ఎస్ఐ సూచించారు. కాగా నీలా అదృశ్యం కావడం వరుసగా అయిదోసారని పోలీసులు తెలిపారు. -
తల్లీబిడ్డ అదృశ్యం
వైఎస్ఆర్ జిల్లా, రామాపురం : మండలంలోని సుద్దమళ్ల పంచాయతీ ఓబుల్‌రెడ్డిగారిపల్లెకు చెందిన కర్ణపు సౌజన్య (30), ఆమె కూతురు భావన కనిపించడం లేదని సౌజన్య తండ్రి రామిరెడ్డి మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సౌజన్య భర్త వెంకటసుబ్బారెడ్డి చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. వారానికి ఒక రోజు ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. వీరికి ఇద్దరు దీక్షితారెడ్డి, భావన అనే ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు దీక్షితారెడ్డి స్ధానిక ఆర్సీఎం చర్చిలో చదువుతోంది. అయితే రెండు రోజులుగా సౌజన్య, భావన కనిపించడం లేదు. వీరికోసం బంధువుల ఇళ్లల్లో కూడా వెతికినా ఫలితం లేదని సౌజన్య తండ్రి రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్ఐ కృష్ణమూర్తి కేసు దర్యాప్తు చేస్తున్నారు -
ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం
సంతోష్‌నగర్: ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యమై న సంఘటన కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. హఫీజ్‌బానగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ జాకీర్ అలీ, షబీ జైనబ్ దంపతులకు హసన్ అలీ (12), అబ్బాస్ అలీ (9) ఇద్దరు కుమారులు. ఈ నెల 17న షబీ జైనబ్ ఇంట్లో చెప్పకుండా తన ఇద్దరు పిల్లలతో కలిసి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టినా ప్రయోజనం లేకపోవడంతో ఆమె భర్త జాకీర్ అలీ సోమవారం కంచన్‌బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు 040–27854761 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. -
ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం
కీసర: ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైన సంఘటన సోమవారం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే హయత్‌నగర్ మండలానికి చెందిన లావణ్య, కీసర మండలం చీర్యాల గ్రామానికి చెందిన దాసుతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కావ్య(12), పరమేష్(10). కుటుంబ కలహాల కారణంగా గత కొంతకాలంగా భార్య భర్తలు దూరంగా ఉంటున్నారు. ఆదివారం పెద్దలు రాజీ కుదుర్చడంతో లావణ్య అత్తగారింటికి వచ్చింది. అయితే అదే రోజు సాయంత్రం దాసు భార్యపై చేయి చేసుకోవడంతో మనస్తాపానికి గురైన లావణ్య పిల్లలతో సహా బయటికి వెళ్లిపోయింది. బంధువుల ఇళ్లలో గాలించినా ఫలితం లేకపోవడంతో లావణ్య తల్లి యాదమ్మ సోమవారం ఉదయం కీసర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు -
ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం
శామీర్‌పేట్: ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైన సంఘటన శామీర్‌పేట పోలీస్ స్టేషన్లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని నాగిశెట్టిపల్లి గ్రామానికి చెందిన ఆదాసు సుజాత ఈ నెల 21న తన కుమారుడు రాంచరణ్, కుమార్తె రేవతిలను తీసుకుని అలియాబాద్‌లో ఉంటున్న తన అక్క వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లింది. రెండు రోజులైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె అత్త నర్సమ్మ, సుజాత అక్కకు ఫోన్ చేయగా తన ఇంటికి రాలేదనితెలిపింది. దీంతో కుటుంబసభ్యులు గాలింపు చేపట్టినా ఆచూకీ అభించకపోవడంతో మంగళవారం శామీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నవీన్‌రెడ్డితెలిపారు. -
తల్లి కోసం తల్లడిల్లుతున్న బాలుడు
హైదరాబాద్ : మూడు రోజుల క్రితం బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి అదృశ్యమైన కె. జ్యోతి(24) అనే యువతి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా అవిడికొత్తపేటకు చెందిన వెంకన్నబాబు, కె.జ్యోతి దంపతులు తమ ఏడాదిన్నర కుమారుడికి చికిత్స నిమిత్తం ఈ నెల 15న రెయిన్బో ఆస్పత్రికి వచ్చారు. బాలుడికి స్కానింగ్ చేయాలని వైద్యులు చెప్పడంతో వారు కొడుకును తీసుకొని సమీపంలోని ఓ స్కానింగ్ సెంటర్‌కు వచ్చాడు. కొడుకుతో పాటు వెంకన్న స్కానింగ్ ల్యాబ్‌లోకి వెళ్లగా జ్యోతి ఆస్పత్రి ఆవరణలో కూర్చుంది. మధ్యాహ్నం బయటకు వచ్చిన వెంకన్నకు తన భార్య కనిపించకపోగా ఆమె హ్యాండ్ బ్యాగ్ ఫోన్ అక్కడ పడి ఉండడంతో ఆందోళనకు గురై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు జ్యోతి ఫోన్ కాల్ డేటాను సేకరించారు. అదృశ్యమయ్యే ముందు ఆమె రమేష్ అనే యువకుడితో మాట్లాడినట్లు తేలింది. దీంతో పోలీసులు రమేష్ ఫోన్‌పై నిఘా ఉంచగా, అతను నెల్లూరులో ఉన్నట్లు తేలడంతో ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపారు. ఇదిలా ఉండగా మూడు రోజులుగా తల్లి లేకపోవడంతో బాలుడు పాల కోసం తల్లడిల్లుతున్నాడు. -
ముగ్గురు పిల్లలతో తల్లి ఆదృశ్యం
చిలకలగూడ: తనకున్న ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి అదశ్యమైన ఘటన హైదరాబాద్ నగరం చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఎస్ఐ భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలగూడ దూద్‌బావికి చెందిన ధనరాజ్, లలిత (27) భార్యాభర్తలు. వీరికి కిరణ్మయి (7), దివ్యశ్రీ (5), శాంతి (3) అనే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ధనరాజ్ పెయింటర్‌గా పనిచేస్తుండగా, లలిత పంజాగుట్టలోని కాల్‌సెంటర్ ఉద్యోగి. ముగ్గురు పిల్లలు, ఇంటిపనితోపాటు ఉద్యోగం చేయడం కష్టం కనుక ఉద్యోగం మానేయాలని ధనరాజ్ కోరాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈనెల 18వతేదీ ఉదయం 8 గంటలకు ముగ్గురు పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిన లలిత తిరిగి ఇంటికి చేరలేదు. సన్నిహితులు, బంధుమిత్రులతో పాటు కాల్‌సెంటర్ యాజమాన్యాన్ని వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో ధనరాజ్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, లలిత ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ భాస్కర్‌రెడ్డి కోరారు.