
అదృశ్యమైన విజయ, ముగ్గురు పిల్లలు(ఫైల్)
విజయ తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండటాన్ని గుర్తించిన శ్రీనునామెను మందలించాడు.
మీర్‌పేట: భర్త మందలించాడని ముగ్గురు పిల్లలతో సహా ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా, దేవరకొండకు చెందిన నేనావత్ శ్రీను నగరానికి వలసవచ్చి నందనవనం వాంబేకాలనీలో భార్య విజయ (35), పిల్లలు నిఖిల్ (16), వైశాలి (13), మహేష్‌లాల్ (11)లతో కలిసి ఉంటూ విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. విజయ తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండటాన్ని గుర్తించిన శ్రీనునామెను మందలించాడు. దీంతో మనస్తాపానికిలోనైన విజయనీ నెల 2న ముగ్గురు పిల్లలతో కలిసి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగిరాలేదు. ఆందోళనకు గురైన శ్రీను బంధువులు, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో బుధవారం మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.