
షబీ జైనబ్ (ఫైల్)
సంతోష్‌నగర్: ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యమై న సంఘటన కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. హఫీజ్‌బానగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ జాకీర్ అలీ, షబీ జైనబ్ దంపతులకు హసన్ అలీ (12), అబ్బాస్ అలీ (9) ఇద్దరు కుమారులు. ఈ నెల 17న షబీ జైనబ్ ఇంట్లో చెప్పకుండా తన ఇద్దరు పిల్లలతో కలిసి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టినా ప్రయోజనం లేకపోవడంతో ఆమె భర్త జాకీర్ అలీ సోమవారం కంచన్‌బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు 040–27854761 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.