
అనూష, రుషి, రేణు (ఫైల్)
మియాపూర్: ఇద్దరు పిల్లలతో సహా ఓ మహిళ అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చందానగర్ వేమకుంటలో ఉంటున్న అనిల్‌కుమార్ అతని భార్య నల్ల అనూష(27) మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం అనూష తన కుమారుడు రుషి (6), కుమార్తె రేణు(4)తో సహా ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె భర్త అనిల్‌కుమార్ బంధువులు, చుట్టు పక్కల గాలించినా ఆచూకీ లభించకపోవడంతో చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.