
నీలా, హర్షవర్దన్ (ఫైల్)
బంజారాహిల్స్: కుమారుడితో సహా ఓ మహిళ అదృశ్యమైన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుధీర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెంకటగిరి ప్రాంతానికి చెందిన బాలు డ్రైవర్‌గా పని చేసేవాడు. గత నెల 30న అతడికి భార్య నీలాతో గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికిలోనైన నీలా కుమారుడు హర్షవర్ధన్ నాయక్(8)తో సహా బయటికి వెళ్లి తిరిగిరాలేదు. దీంతో ఆందోళన చెందిన బాలు పరిసరాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆచూకీ తెలిసిన వారు 9703900452 నంబర్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ సూచించారు. కాగా నీలా అదృశ్యం కావడం వరుసగా అయిదోసారని పోలీసులు తెలిపారు.