ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యం | Mother Missing With Three Children in Hyderabad | Sakshi
Sakshi News home page

ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యం

Jul 28 2020 8:14 AM | Updated on Jul 28 2020 8:14 AM

Mother Missing With Three Children in Hyderabad - Sakshi

మియాపూర్‌: ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన సంఘటన మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... మియాపూర్‌లోని ఓంకార్‌ నగర్‌లో కాలేమ్‌ హుస్సేన్, కాలేమ్‌ జయ భార్యాభర్తలు. తమ పిల్లలు కూతురు స్వప్న(11), కుమారుడు శిరీష(7), ఇషాన్‌(8)తో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఇద్దరూ కూలీపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇంట్లో చెప్పకుండా జయ తన ముగ్గురు పిల్లలను తీసుకొని వెళ్లి పోయింది. రాత్రి అయినా తిరిగి ఇంటికి  రాలేదు. భర్త హుస్సేన్‌ పరిసర ప్రాంతాలు, బంధువుల ఇళ్లల్లో వాకబు చేసినా ఆచూకీ లభ్యం కాలేదు. ఆందోళన చెందిన భర్త మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement