
సుజాత (ఫైల్) రాంచరణ్(ఫైల్) రేవతి (ఫైల్)
శామీర్‌పేట్: ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైన సంఘటన శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని నాగిశెట్టిపల్లి గ్రామానికి చెందిన ఆదాసు సుజాత ఈ నెల 21న తన కుమారుడు రాంచరణ్, కుమార్తె రేవతిలను తీసుకుని అలియాబాద్‌లో ఉంటున్న తన అక్క వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లింది. రెండు రోజులైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె అత్త నర్సమ్మ, సుజాత అక్కకు ఫోన్ చేయగా తన ఇంటికి రాలేదనితెలిపింది. దీంతో కుటుంబసభ్యులు గాలింపు చేపట్టినా ఆచూకీ అభించకపోవడంతో మంగళవారం శామీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నవీన్‌రెడ్డితెలిపారు.