
లావణ్య(ఫైల్) కావ్య, పరమేష్ (ఫైల్)
కీసర: ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైన సంఘటన సోమవారం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే హయత్‌నగర్ మండలానికి చెందిన లావణ్య, కీసర మండలం చీర్యాల గ్రామానికి చెందిన దాసుతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కావ్య(12), పరమేష్(10). కుటుంబ కలహాల కారణంగా గత కొంతకాలంగా భార్య భర్తలు దూరంగా ఉంటున్నారు. ఆదివారం పెద్దలు రాజీ కుదుర్చడంతో లావణ్య అత్తగారింటికి వచ్చింది. అయితే అదే రోజు సాయంత్రం దాసు భార్యపై చేయి చేసుకోవడంతో మనస్తాపానికి గురైన లావణ్య పిల్లలతో సహా బయటికి వెళ్లిపోయింది. బంధువుల ఇళ్లలో గాలించినా ఫలితం లేకపోవడంతో లావణ్య తల్లి యాదమ్మ సోమవారం ఉదయం కీసర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment