పతిధర్మం తెలియని మోడీ
మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు లలిత
నిజామాబాద్, న్యూస్‌లైన్: దేశానికి ప్రధానమంత్రి కావాలని పగటి కలలు కంటున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి పతిధర్మమే తెలియదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత విమర్శించారు.
అలాంటి వ్యక్తి రాజధర్మాన్ని ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. శుక్రవారం నిజామాబాద్ డీసీసీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మోడీకి 17వ ఏటనే పెళ్లయితే, సంసారబంధాన్ని వదిలి ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారని అనడం, ఇప్పుడు భార్య పేరు ప్రకటించటం విడ్డూరంగా ఉందన్నారు. దీంతోనే మహిళల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ది ఏమిటో తెలుస్తోందన్నారు. ఇలాంటి నాయకుడు దే శానికి ప్రధాని అయితే మహిళలకు ఏ విధమైన రక్షణ ఇస్తారో ప్రజలు ఆలోచించాలని ఆమె కోరారు