ప్రచారానికి తెర | general election campaign ended | Sakshi
Sakshi News home page

ప్రచారానికి తెర

Published Tue, Apr 29 2014 1:55 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

general election campaign ended

 నిజామాబాద్‌అర్బన్,న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార పర్వానికి తెరపడింది. పదహారు రోజుల పాటు అభ్యర్థులు హోరాహోరిగా ప్రచార యుద్ధం చేశారు. సోమవారంతో ఈ ఘట్టం ముగిసి పోయింది. మరో రెండు రోజుల్లో పోలింగ్ జరుగనుంది. జిల్లాలోని తొమ్మిది నియోజక వర్గాల్లో 101 మంది అసెంబ్లీ అభ్యరు ్థలు, రెండు లోక్‌సభ నియోజక వర్గాల్లో 26 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి పడరాని పాట్లు పడ్డారు. పాదయాత్రలు, ర్యాలీ లు నిర్వహించారు.

 బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్,  బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి ప్రకాశ్‌జవదేకర్‌లు  జిల్లాకు వచ్చి ప్రచారం కొనసాగించారు. కాంగ్రెస్ తరపున రాహుల్‌గాంధీ, అజారుద్దీన్, కేంద్ర మంత్రి గులాబ్‌నబీఆజాద్, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నా ల లక్ష్మయ్య వచ్చి వెళ్లారు. టీఆర్‌ఎస్ తరపున కేసీఆర్ మూడు సార్లు జిల్లాకు వచ్చి బహిరంగ సభల్లో పాల్గొన్నారు.
 
 రాత్రి వేళ..
 ఈ నెల 30న పోలింగ్ జరుగ నుండగా ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్లకు ప్రలోభాలతో ఎర వేస్తున్నారు. డబ్బు లు, మద్యం పంపిణీలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్‌కు రూ. 200 చొప్పున అందజేస్తున్నారు. మహిళ సంఘాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.  జిల్లా కేంద్రంలో అభ్యర్థులు ఓటుకు రూ. 1000 చొప్పున అందిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గృహోపకరణాలు, చీరెలు పంపిణీ చేస్తూ మహిళలను ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారమంతా గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతోంది. ఆయా పార్టీల కార్య కర్తలు రాత్రి వేళ ఓటర్ల ఇళ్లకు వెళ్లి అభ్యర్థుల తరపున రహస్యంగా కానుక లు సమర్పించుకుంటున్నారు. కుల సంఘాలు, యువజన సంఘాలకు మందు, విందు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement