నేడు మోడీ రాక
- జిల్లా కేంద్రంలో బహిరంగభ
- భారీ బందోబస్తు చర్యలు
- విజయవంతం చేయండి : పల్లె గంగారెడ్డి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్రమోడీ మంగళవారం జిల్లాకు రానున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నిజామాబాద్ నగరంలోని గిరిరాజ కళాశాల సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మోడీతో పాటు ఈ సభకు బీజేపీ జాతీయ నాయకుడు ప్రకాశ్ జవదేకర్, రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌లు వస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ‘సాక్షి’కి తెలి పారు.
మధ్యాహ్నం 12 గంటలకు మోడీ బహిరం గ సభకు హాజరవుతారని పేర్కొన్నారు. కాగా మోడీ సభ ఏర్పాట్లను ఇప్పటికే బీజేపీ నాయకు లు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, గుజరాత్ ఇంటలిజెన్స్ అధికారులు పర్యవేక్షించారు. సభాస్థలికి దూరంగా వేసిన హెలిపాడ్‌ను సైతం అధికారులు పరిశీలించి బందోబస్తు చర్యలపై సమీక్షిం చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మోడీ సభను విజయవంతం చేయాలని పల్లెగంగారెడ్డి ప్రజలను, పార్టీ శ్రేణులను కోరారు. సభకు హాజర య్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
గుజరాత్ పోలీసుల ఆధీనంలో వేదిక
నిజామాబాద్‌క్రైం : నరేంద్ర మోడీ సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోడీ ఉదయం 11 గంటలకు నాందేడ్‌లో (మహారాష్ట్ర) సభ ముగిసిన అనంతరం నేరుగా జిల్లా కేంద్రానికి మధ్యహ్నం 1.45 గంటలకు చేరుకోనున్నారు. ఇప్పటికే సభ జరిగే ప్రాంతాన్ని, వేదికను గుజరాత్ స్పెషల్ పోలీస్ అధికారులు(ఐఏఎస్‌లు) స్వాధీనం చేసుకున్నారు. సభ ప్రాంగణం చుట్టూ పరిసరాలను సోమవారం బాంబు స్క్వాడ్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. బందోబస్తుకు జిల్లాకు చెందిన ఎస్పీ,ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు, 14 మంది సీఐలు, 15 మంది ఎస్సైలు, 1062 మంది కానిస్టేబుళ్లు, 30 మంది మహిళ కానిస్టేబుళ్లు, 120 మంది హోంగార్డులు నియమించారు. మోడి కలిసే నాయకులకు వీఐపీలకు పాస్‌లు జారీ చేశారు.
అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం
వినాయక్‌నగర్ : మోడీ సభకు అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉంది. అగ్నిమాపక జిల్లా సహాయ అధికారి సతీష్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యాలయ ఆవరణలో మాక్‌డ్రిల్ కూడా నిర్వహించారు.