కొత్త కిరికిరి
- చిక్కుముడుల ‘మల్కాజిగిరి’
- మోడీ మద్దతు కోరిన జేపీ
- వపన్ నా వెనుకే అంటున్న వైనం మల్లారెడ్డిని గెలిపించాలన్న మోడీ
- ఇంతకీ ఎవరికి మద్దతో తెలియక గందరగోళం
- టీడీపీ, బీజేపీ శ్రేణుల్లో అయోమయం
సాక్షి, సిటీబ్యూరో: ‘హాట్‌స్పాట్’ లోక్‌సభ స్థానం మల్కాజిగిరి ఇప్పుడు సరికొత్త చిక్కుముళ్లకు వేదికైంది. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, లోక్‌సత్తా.. మధ్యలో పవన్‌కల్యాణ్.. వీరి చుట్టూ తిరుగుతున్న రాజకీయం ఆయా పార్టీ శ్రేణులను, అభిమానులను అయోమయంలో పడేస్తున్నాయి. ఎవరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు?, తాము ఎవరి వైపు నిలవాలో తెలియక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఈ పరిణామాల పర్యవసానాలకు మల్కాజిగిరి లోక్‌సభ టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డి బలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.
గందరగోళానికి తెరలేచిందిలా..
మోడీ రాక టీడీపీ, బీజేపీ శ్రేణుల్లో ఊపు తెస్తుందనుకుంటే కొత్త చిక్కులకు తెరలేపింది. మంగళవారం సాయంత్రం బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో దిగిన నరేంద్ర మోడీతో లోక్‌సత్తా అధినేత, ఆ పార్టీ మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి జయప్రకాశ్ నారాయణ (జేపీ) భేటీ అయ్యారు. ఏకాంతంగా మంతనాలు సాగించారు. బీజేపీకి తన మద్దతుతెలిపారు.
అంతవరకు బాగానే ఉంది. తీరా ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో తమ కూటమి అభ్యర్థిగా చామకూర మల్లారెడ్డి (టీడీపీ మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి)ని మోడీ పరిచయం చేశారు. దీంతో లోక్‌సత్తా, బీజేపీ, తెలుగుదేశం శ్రేణుల్లో గందరగోళం మొదలైంది. ఇదిలా ఉంటే, నరేంద్ర మోడీతో కలిసి వివిధ సభల్లో పాల్గొన్న సినీ నటుడు పవన్ కళ్యాణ్ త్వరలో జయప్రకాష్ నారాయణ తరపున మల్కాజిగిరి లోక్‌సభ నియోకజవర్గంలో ప్రచారం చేయాలని నిర్ణయించటంతో ఇప్పటికే బీజేపీ మద్దతుతో ముందుకు వెళుతున్న టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డి చిక్కుల్లో పడ్డారు.
ఇది ‘చంద్ర’జాలమేనా?!
టీడీపీకి రాజగురువుగా వ్యవహరిస్తున్న ఓ పత్రికాధిపతి సూచన మేరకు జేపీ మంగళవారం సాయంత్రం మోడీని కలుసుకోగా, జేపీకి మద్దతుగా సినీ నటుడు పవన్‌కల్యాణ్ చేత మల్కాజిగిరిలో ప్రచారం చేయించే అంశంలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం ఉండి ఉంటుందని ఆ పార్టీ నాయకులే అనుమానిస్తున్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుని ముందుకు వెళుతున్న సమయంలో, పోలింగ్‌కు వారం ముందు జేపీ పావులు కదుపుతున్న వైనం వెనక రాజగురువు, చంద్రబాబుల హస్తం లేకుండా ఉండదని ఊహిస్తున్నారు.
ఇప్పటికే కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌లలోని టీడీపీ క్రియాశీలక కార్యకర్తలు నేరుగా జేపీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటుండటం గమనార్హం. మొత్తానికి బాబు వూర్కు రాజకీయూలు మల్కాజిగిరి టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డిని ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. సొంత సావూజికవర్గం ఒత్తిళ్లు, కొత్తగా రాజకీయు నేత అవతారమెత్తిన పవన్‌ను ప్రసన్నం చేసుకునే యుత్నం, మోడీ సూచనలు.. ఇవన్నీ కలగలిపి సొంత పార్టీ అభ్యర్థికే మొండిచేరుు చూపేందుకు బాబు సిద్ధమయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అప్పట్లో టీడీపీ, బీజేపీతో కూటమి కట్టేందుకు జేపీ యుత్నించినా బాబు స్పందించలేదు. కానీ, జేపీ నామినేషన్ వేసిన నాటి నుంచి, ఉపసంహరణ తేదీ వరకు సొంత సావూజికవర్గం నుంచి బాబుపై ఒత్తిళ్లు వస్తూనే ఉన్నారుు. ఇద్దరు పత్రికాధిపతులు కూడా జేపీ కోసం బాబుతో రాయబారం నడిపినట్లు ప్రచారం జరిగింది. పోలింగ్‌కు మరో వారమే మిగిలి ఉండగా మంగళవారం సరికొత్త రాజకీయం తెరపైకి వచ్చి మల్లారెడ్డిని చిక్కుల్లోకి నెట్టింది.
ఇదేం చిక్కుముడి?
బేగంపేట విమానాశ్రయంలో మోడీతో పాటుగా చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డితో కలిసి మాటలు పంచుకున్నట్లు జేపీ స్వయుంగా వెల్లడించారు. అలాగే పవన్ తన కోసమే మల్కాజిగిరి పోటీ నుంచి తప్పుకున్నారని, ఓట్లు చీలకూడదని ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మోడీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, తాను మల్కాజిగిరి నుంచి గెలుపొందడం దేశానికి అవసరమనిపవన్ గుర్తించారని, పవన్ తన కోసం ప్రచారం చేస్తారని ఈ సందర్భంగా విస్పష్టంగా ప్రకటించారు. కానీ, ఎల్‌బీ స్టేడియంలో జరిగిన సభలో అభ్యర్థులను పరిచయుం చేసేటప్పుడు మోడీ వుల్లారెడ్డి పేరును కూడా ప్రస్తావించారు.
దీంతో మోడీ మద్దతు జేపీకా?, మల్లారెడ్డికా? అనేది టీడీపీ, బీజేపీ శ్రేణుల్ని గందరగోళానికి గురిచేసింది. మరోపక్క- తనను నమ్మిన వారికి సీమాంధ్రలో టికెట్లు ఇవ్వలేదని చంద్రబాబుపై గుర్రుగా ఉన్న పవన్‌కల్యాణ్ కూడా అదే వేదిక పంచుకున్నారు. పవన్ తన కోసం ప్రచారం చేస్తారని జేపీనే చెప్పుకున్నారు. ఈ పరిస్థితుల్లో పొత్తు ఏమిటో, పవన్, జేపీల ప్రచారం ఏమిటో, తీరా చంద్రబాబు ఎలా స్పందిస్తారో తెలియక మల్లారెడ్డి మతి పోగొట్టుకుంటున్నారు.