మోడీ సభకు జనం కరువు
బీజేపీ అభ్యర్థి పేరును మార్చేసిన బాబు పసలేని పవన్ ప్రసంగ ం
సాక్షి, ఏలూరు : ఒకరు దేశ ప్రధాన మంత్రి అభ్యర్థి మోడీ.. మరొకరు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకుం టున్న వ్యక్తి చంద్రబాబు.. ఇంకొకరు దేశభక్తి తనకు చాలా ఎక్కువని చెప్పుకుంటున్న పవన్‌కల్యాణ్. వారి ముగ్గురి కలరుుకను తీన్‌మార్‌గా చెప్పుకుంటూ వాపును బలంగా చూపుకునే ప్రయత్నం చేస్తున్న బీజేపీ, టీడీపీ శ్రేణులు భీమవరం సమీపంలోని పెదఅమిరంలో గురువారం ఏర్పాటు చేసిన సభ కు జనం తండోపతండాలుగా వచ్చేస్తారని భావించారు. కానీ జరిగింది వేరు. సుమారు 40 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో 30కి పైగా ఎకరాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. దీంతో బీజేపీ, టీడీపీ నేతలంతా కంగుతిన్నారు. గురువారం సాయంత్రం 5గంటలకు ప్రారంభమైన సభ 45 నిమిషాల్లో ముగిసింది.
సభపై టీడీపీ, బీజేపీ భారీ అంచనాలు పెట్టుకున్నాయి. బిర్యానీ ప్యాకెట్లు, నోట్లు ఇచ్చి జనాన్ని ఆటోల్లో, లారీల్లో సభా ప్రాంగణానికి తీసుకొచ్చారు. మోడీ సహా అగ్రనేతలందరూ హెలికాప్టర్‌లో వచ్చారు. తీరా చూస్తే సభలో జనం లేరు. కనీ సం వేసిన కుర్చీలు కూడా నిండలేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో మోడీ నిర్వహించిన తొలి సభకు అంతంతమాత్రం గానే జనం రావడం, స్పందన లేకపోవడంతో బీజేపీ నేతలు ఆశ్చర్యపోయా రు. కేవలం రెండు పార్టీల నేతలు, వారివెంట వచ్చిన అనుచరులు తప్ప సామాన్య జనం పెద్దగా కనిపించ లేదు. ప్రలోభపెట్టి తరలించిన వారు సైతం 3గంటలకు జరగాల్సిన సభ ఆలస్యం కావడంతో వెనుదిరిగారు.
స్థానిక సమస్యల్ని ప్రస్తావించిన మోడీ
మోడీ ప్రసంగంలో స్థానిక సమస్యల్ని ప్రస్తావించారు. మత్స్య, లేసు పరిశ్రమలను అభివృద్ధి చేస్తానన్నారు. కొలే ్లరు కాంటూరును 5 నుంచి 3కు కుది స్తామన్నారు. ఇవన్నీ చంద్రబాబుతో కలిసి చేస్తానని చెప్పడంతో జనం నిరుత్సాహపడ్డారు. చంద్రబాబు ప్రసం గం ఎప్పటిలా అంతా తన గొప్పదనమే అన్నట్టుగానే సాగింది. తాడేపల్లిగూడెం బీజేపీ అభ్యర్థి పేరునే ఆయన మర్చిపోయారు. ‘వీర్రాజు’ ను గెలిపిం చండి అనేసరికి ఆయనెవరంటూ జనంలో అలజడి రేగింది. వేదికపై ఉన్న పైడికొండల మాణిక్యాలరావు బాబు వద్దకు వెళ్లి నిలబడ్డారు. అయినా బాబు ఆ పేరునే ప్రస్తావిం చారు. దీంతో మాణిక్యాలరావు తనపేరు చెప్పుకోవాల్సి వచ్చింది. టీడీపీ మిగతా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులెవరి గురించి బాబు ప్రస్తావించలేదు. పవనకల్యాణ్ ప్రసంగం స్థానిక అంశాలకు ఏమాత్రం సంబంధం లేనట్టుగా సాగడంతో జనానికి అర్థం కాలేదు. ఎవరూ ఆదరించకపోవడంతో రాజ కీయ అనాథగా మిగిలిన మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు మోడీకి గజమాల వేసి బీజేపీలో చేరారు. ప్రజలకు కూడు, గూడు, గుడ్డ ఇవ్వాల్సిందిగా మోడీకి సూచించిన కావూరి తీరు బీజేపీ నేతలకే వెగటు పుట్టించింది.
కార్మికులు గుర్తు రాలేదు
కాళ్ళ, న్యూస్‌లైన్: దేశ ప్రగతి, అభివృద్ధి అంటూ ఊదరగొట్టిన నరేంద్రమోడీ, చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌లకు కార్మికులు గుర్తు రాలేదు. మేడే సందర్భంగా గురువారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని కార్మికులు నిర్వహించుకున్నారు. అదే రోజున భీమవరం సమీపంలోని పెదఅమిరంలో ఎన్నికల సభ నిర్వహించిన ఆ ముగ్గురు నేతలు కనీసం కార్మికులకు సమస్యల్ని ప్రస్తావించడం, వారి సంక్షేమం గురించి మాట్లాడం చేయలేదు. మోడీ సభకు వచ్చిన వారంతా అదేంటి కార్మికుల దినోత్సవం రోజున కార్మికుల ప్రస్తావన తేలేదంటూ నిట్టూర్చారు.