పాదయాత్రలో ఎమ్మెల్సీ లలిత, అమర్‌నాథ్ బాబు, లక్ష్మాపూర్, మల్కాపూర్ గ్రామస్తులు
నిజామాబాద్ రూరల్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 2న నిజాంసా గర్ మండల కేంద్రం నుంచి టీడీపీ భూస్వాముల కోసమే రైతుబంధు పథకం రాష్ట్ర నాయకుడు రాష్ట్ర మాజీ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మ న్ అమర్‌నాథ్‌బాబు సారథ్యంలో ప్రారంభించిన సకల జనుల పాదయాత్ర ఆదివారంతో నిజామా బాద్ మండలం మల్కాపూర్, లక్ష్మాపూర్, గుండారం, సారంగపూర్‌కు చేరుకుంది.
దీనికి ఎమ్మెల్సీ ఆకుల లలిత సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వం రైతుబంధు పథకం భూస్వాముల కోసమే ప్రవేశపెట్టిందని విమర్శించారు. ప్రత్యేక బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు భాగిర్తి బాగారెడ్డి, టీడీపీ జిల్లా లీగల్‌సెల్ అధ్యక్షుడు సురేష్, నవీపేట మండల అధ్యక్షుడు రచ్చ సుదర్శన్, నాయకులు మువ్వ నాగేశ్వర్‌రావు, ఇస్మాయిల్ పటేల్, మల్లేశం, గోపాల్‌రెడ్డి, సురేష్, న్యాయవాది దొంతి సాయన్న, బోధన్ టీడీపీ నాయకుడు వెంకటేశ్వర్‌రావు ఉన్నారు.
మహాధర్నాను జయప్రదం చేయండి
సకల జనుల పాదయాత్ర సోమవారం ముగిస్తున్నట్లు జిల్లా టీడీపీ అధ్యక్షుడు భాగిర్తి భాగారెడ్డి అన్నారు. ప్రజల సంక్షేమం కోరేందుకు చేపడుతున్న సకల జనుల పాదయాత్రల ఉద్యమానికి అందరూ కలెక్టరేట్‌కు కోరారు. మహాసభను జయప్రదం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment