లలిత (ఫైల్)
నిజామాబాద్: ఖలీల్వాడిలోని నాందేవ్‌వాడలో నివాసం ఉంటున్న బుక్యా లలిత(50) హత్యకు గురైంది. ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాలు.. బోధన్ మండలం బెల్లాల్ గ్రామానికి చెందిన బుక్యా లలిత ఏడాది నుంచి నగరంలోని ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో పని చేస్తూ.. నాందేవ్‌వాడలో ఒంటరిగా ఉంటోంది. రెండు రోజులుగా లలిత ఫోన్ కలవకపోవడంతో సోమవారం ఉదయం ఆమె కూతురు వచ్చి చూడగా ఇంటికి తాళం ఉంది. దీంతో ఆమె మూడో టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు ఇంటికి వెళ్లి చూశారు. ఏవైనా ఆధారాలు దొరుకుతాయని తాళం పగులగొట్టి చూడగా లలిత మృతదేహం నగ్నంగా ఉంది. రెండు రోజుల క్రితం చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. శనివారం ఆమె ఎవరితోనో కలిసి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మహిళ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని అధికారులు గుర్తించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. ఏసీపీ కిరణ్‌కుమార్, సీఐ నరహరి ఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment