కలెక్టరేట్ ఎదుట కానిస్టేబుల్ భార్య ధర్నా | police constable wife holds agitation before collector office | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్ ఎదుట కానిస్టేబుల్ భార్య ధర్నా

Published Thu, Dec 8 2016 6:36 PM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM

police constable wife holds agitation before collector office

కరీంనగర్: భర్త వేధింపులు తాళలేక ఓ కానిస్టేబుల్ బార్య కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన కానిస్టేబుల్ శ్రీకాంత్ గత కొన్ని రోజులుగా భార్య లలితను వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో విసిగిపోయిన లలిత పిల్లలతో కలిసి గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు కలెక్టరేట్ ఎదుటే కూర్చుంటానని పట్టుబట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమె నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement