సాక్షి, కరీంనగర్ : పట్టణంలోని అలుగనూరు-మానేరు బ్రిడ్జిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్‌లోని శుభాష్‌నగర్‌కు చెందిన గడ్డి శ్రీనివాస్, అతని భార్య సునీత, మరో వ్యక్తి ప్రయాణిస్తున్న కారు ప్రమదవశాత్తూ బ్రిడ్జి పైనుంచి కాలువలో పడిపోయింది. దీంతో కారు నడుపుతున్న శ్రీనివాస్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా.. సునీత, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.
ఆదివారం కావడంతో కుటుంబంతో కలిసి శ్రీనివాస్ కొమురవెళ్లి మల్లన్న దర్శనానికి వెళ్తున్నట్టు తెలిసింది. అయితే, ప్రమాదానికి గురైన కారును పరిశీలిస్తున్న క్రమంలో అక్కడే విధుల్లో ఉన్న చంద్రశేఖర్ గౌడ్ అనే కానిస్టేబుల్ అదుపుతప్పి కాలువలో పడిపోయాడు. కాలువలో నీరు తక్కువగా ఉండటంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆయన కరీంనగర్ వన్‌టౌన్‌లో పనిచేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు అధికారులు, మంత్రి గంగుల కమలాకర్ సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment