తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. లలితా రైస్ మిల్స్‌లో ఐటీ అధికారులు గురువారం సోదాలు చేపట్టారు. ఏడు బృందాలుగా ఏర్పడి అధికారులు ఈ తనిఖీలు జరిపారు. కాగా లలితా రైస్‌మిల్స్ యజమానులు మట్టే ప్రసాద్, శ్రీనివాస్.. మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు అత్యంత సన్నిహితులు. ఖరీదైన, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన షాటెక్స్ యంత్రాలతో మిల్లింగ్ చేసిన బియ్యాన్ని నౌకల ద్వారా విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారులుగా వీరికి పేరుంది.