East Godavari district.
-
AP: ఊరిలోనే రిజిస్ట్రేషన్
సాక్షి, రాజమహేంద్రవరం: గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు మార్గం సుగమమైంది. రిజిస్ట్రేషన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా తొలుత 51 గ్రామ, వార్డు సచివాలయాలను ఎంపిక చేసింది. ఎలాంటి భూ వివాదాలు లేని, సమగ్ర భూ సర్వే పూర్తయిన 33 సచివాలయాల పరిధిలోని గ్రామాల్లో ఈ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్టుగా కొవ్వూరు నియోజకవర్గం తోగుమ్మి, రాజానగరం నియోజకవర్గం భూపాలపట్నం సచివాలయాల్లో సేవలను ఇప్పటికే ప్రారంభించింది. త్వరలో నిర్దేశించిన 31 సచివాలయాల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇప్పటి వరకు ఏం జరుగుతోందంటే.. స్థిర, చరాస్తులు, విక్రయాలు, కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాల్సిందే. ఈ క్రమంలో అక్కడున్న డాక్యుమెంట్ రైటర్లు, దళారులు నిర్ణయించిన ధర చెల్లించాల్సి వచ్చేది. లేని పక్షంలో డాక్యుమెంట్లు సక్రమంగా లేవంటూ కొర్రీలు పెట్టి వెనక్కు పంపుతున్న సంఘటనలు కోకొల్లలు. కొందరు సబ్ రిజిస్ట్రార్లు దళారులతో కుమ్మక్కు కావడంతో అక్రమ తంతు యథేచ్ఛగా నడిచేది. అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందేలా చర్యలు తీసుకుంది. భూముల అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలన్నీ సచివాలయ కేంద్రంగానే చేపట్టేలా ఆదేశాలు ఇచ్చింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేపట్టింది. ప్రక్రియ సమర్థవంతంగా జరగాలంటే భూముల వివాదాలు ఉండకూడదని భావించింది. సమగ్ర భూ సర్వే పూర్తయిన గ్రామాల్లో అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావించి తొలుత అలాంటి గ్రామాలను ఎంపిక చేసింది. సిబ్బందికి అవగాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియపై గ్రామ సచివాలయ సిబ్బందికి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఇప్పటికే అవగాహన కల్పించారు. ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేసి మరీ డాక్యుమెంట్ల పరిశీలన, చలానా తదితర విషయాలపై సమగ్రంగా సమాచారం అందించారు. ఇది వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందే సేవలన్నీ సచివాలయాలకు అనుసంధానం చేశారు. అక్నాలెడ్జ్మెంట్ అప్డేట్, డేటా ఫీడింగ్, చెక్స్లీప్, రెగ్యులర్ నంబర్ కేటాయింపు, ఫొటో, వేలిముద్రలు తీసుకోవడం, డాక్యుమెంట్ ప్రింటింగ్, స్కానింగ్, దస్తావేజు, సెటిల్మెంట్ దస్తావేజు, దాన విక్రయ, తనఖా, చెల్లు రశీదు, భాగ పరిష్కార రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, వివాహ రిజిస్ట్రేషన్ తదితర సేవలు ఉన్న ఊళ్లోనే అందుతాయి. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేందుకు సచివాలయంలో ఒక పంచాయతీ సెక్రటరీకి ప్రభుత్వం జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ హోదా కల్పించింది. ఇకపై సచివాయలంలో జరిగే స్థిర, చరాస్తి క్రయ, విక్రయాల విక్రయం, కోనుగోలుపై పర్యవేక్షణ చేయాల్సి ఉంది. రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రెండు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రెండింటిలోనూ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కొవ్వూరు నియోజకవర్గం తోగుమ్మిలో ఇప్పటి వరకు 101 రిజిస్ట్రేషన్లు జరిగ్గా వీటి విలువ రూ.26,58,522గా ఉంది. రాజానగరం నియోజకవర్గం భూపాలపట్నంలో రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. లేఅవుట్లు ఎక్కువగా ఉన్న కారణంతో భారీగా ఆదాయం సమకూరినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇప్పటి వరకు రూ.16,96,53,581 విలువ చేసే 302 స్థిర, చరాస్తులు రిజిస్ట్రేషన్లు జరగ్గా.. రూ.73,23,939 ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. త్వరలో మరిన్ని గ్రామాల్లో.. జిల్లాలో త్వరలో మరిన్ని గ్రామాల్లో సేవలు ప్రారంభం కానున్నాయి. అందులో నేలటూరు, నందిగంపాడు, జగన్నాథపురం, జగన్నాథపురం(గంగవరం), చిడిపి, తిమ్మరాజుపాలెం, బల్లిపాడు, పేరరామచంద్రపురం, అనపర్తి–5, కొప్పవరం, మహేంద్రవాడ–1, పోలమూరు–1, రామవరం–1, కుతుకులూరు–1, పెదపర్తి, పూలగుర్త, ఇల్లపల్లి, ఇల్లపల్లి(తుమ్మలాపల్లి), ఇల్లపల్లి(రాళ్లకండ్రిగ), కోమారిపాలెం–2, తొస్సిపూడి, పందలపాక–1,కొంకుదురూరు–1, దామిరెడ్డిపల్లి, బొమ్మూరు–2, రాజవోలు–1, శ్రీకృష్ణపట్నం, జి.ఎర్రవరం, నామవరం, సుభద్రంపేట, నార్త్ తిరుపతి రాజాపురం సచివాలయాల్లో త్వరలో సేవలు అందుబాటులోకి వస్తాయి. అవగాహన కల్పిస్తున్నాం రిజిస్ట్రేషన్ పక్రియపై సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నాం. స్థిరాస్తి క్రయ, విక్రయాలు, ఏ సేవకు ఎంత వసూలు చేయాలన్న విషయమై సమగ్రంగా చెబుతున్నాం. చలానాలు, ప్రభుత్వ ఫీజులు తీసుకోవాల్సిన వాటిపై చెబుతున్నాం. సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే ఎలా అధిగమించాలో స్పష్టం చేస్తున్నాం. తొలి విడతలో కేటాయించిన వాటిలో రిజిస్ట్రేషన్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయి. మిగిలిన వాటిలో సైతం పారదర్శకంగా జరిగేలా చూస్తాం. – ఆనందరావు, జిల్లా రిజిస్ట్రార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ -
‘యానాం’ రైతులకూ ‘వైఎస్సార్ రైతు భరోసా’
సాక్షి, అమరావతి: ఆంధ్రాలో భూములున్న యానాం రైతులకూ ఇక నుంచి వైఎస్సార్ రైతు భరోసా పథకం వర్తించనుంది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో భాగమైన యానాం తూర్పు గోదావరి జిల్లాకు మధ్యలో ఉంటుంది. అక్కడి రైతుల విజ్ఞప్తి మేరకు వారికి కూడా వైఎస్సార్ రైతు భరోసా వర్తింప చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రాలో భూములున్న యానాం రైతులకు 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి వైఎస్సార్ రైతు భరోసా లబ్ధి అందనుంది. యానాంకు చెందిన 865 మంది రైతులకు ఏపీలో వ్యవసాయ భూములున్నాయి. ఒక్కొక్కరికీ రైతు భరోసా కింద రెండు విడతల్లో రూ.7,500 జమ చేయనున్నారు. మొదటి విడతగా మే 13న ఆంధ్ర ప్రాంత రైతులతో పాటు రూ.5,500 వేల చొప్పున ఆ రైతులకూ జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆనందంగా ఉంది నాకు యానాంలో ఐదెకరాలుంది. ఆంధ్రా పరిధిలో రెండెకరాలుంది. వైఎస్సార్ రైతు భరోసాకు గతంలో దరఖాస్తు చేశా. ఆధార్ కార్డు యానాం అడ్రస్‌తో ఉండడంతో నాన్ రెసిడెంట్ అంటూ రైతు భరోసా వర్తింప చేయలేదు. ఆంధ్రాలో భూములున్న యానాం రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు భరోసా వర్తింప చేయాలని నిర్ణయించడం చాలా ఆనందంగా ఉంది. – కోన సత్తియ్య, రైతు, యానాం సీఎం కీలక నిర్ణయంతో.. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం రైతులకు ఏపీలో పలుచోట్ల భూములున్నాయి. స్థానికంగా నివసించని కారణంగా వారికి వైఎస్సార్ రైతు భరోసా వర్తించదు. అయినప్పటికీ వైఎస్సార్ రైతు భరోసా వర్తింప చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల చెందిన 865 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ చదవండి: ఏపీ: షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వండి -
యానాంలో అద్భుత దృశ్యం
తూర్పుగోదావరి జిల్లా యానాంలో అద్భుత దృశ్యం కనువిందు చేసింది. మనకు పెద్దగా పరిచయం లేని టోర్నడో యానాంకు సమీపంలో చెరువుల వద్ద శుక్రవారం కనిపించింది. ఆకాశంతో భూమి కలిసిపోయిందా అన్నట్లుగా ఉన్న ఆ దృశ్యం అందరినీ ఆకర్షిస్తోంది. ఆ దృశ్యాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. తమ సెల్ ఫోన్లో బంధించడమే కాకుండా వైరల్ చేశారు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ టోర్నడో వీడియో చూపరులను విపరీతంగా ఆకట్టుకుంది. మరొకవైపు ఇది స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. (హృదయాన్ని తాకే వీడియో: నీళ్ల కోసం ఉడత..) -
లలితా రైస్ మిల్స్‌లో ఐటీ దాడులు
-
మరణంలోనూ అమ్మకు తోడుగా..
కడియం: నవమాసాలూ మోసి, కని, పెంచి.. ఇంతటివాడిని చేసిన తల్లి కళ్లముందే విలవిల్లాడిపోతుంటే చూస్తూ తట్టుకోలేకపోయాడు.. ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గంమధ్యలో తల్లితోపాటు ప్రాణాలు విడిచాడు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంక గ్రామంలో ఈ ఘటన పెను విషాదాన్ని నింపింది. నర్సరీ రైతు పాటంశెట్టి వెంకట్రాయుడి భార్య సత్యవతి (55)కి శుక్రవారం రాత్రి గుండెపోటు వచ్చింది. వెంటనే పెద్ద కుమారుడు శ్రీనివాసరావు (38), కుటుంబ సభ్యులు ఆమెను కారులో రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ముందు సీటులో కూర్చున్న శ్రీనివాసరావు ఫోనులో ఆస్పత్రి వర్గాలతో మాట్లాడుతున్నాడు. కొంత దూరం వెళ్లేసరికి తల్లి ఆరోగ్యం మరింత విషమించింది. గుండె నొప్పితో తల్లి కళ్లెదుటే అల్లాడిపోతుంటే చూడలేక శ్రీనివాసరావు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఫోనులో మాట్లాడుతూనే సీటులో పక్కకు ఒరిగిపోయాడు. కారులో ఉన్నవాళ్లకేమీ అర్థం కాలేదు. శ్రీనివాసరావును తట్టి లేపుతూనే ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వైద్యులు పరీక్షించేసరికే తల్లీకొడుకులు మృతిచెందారు. ఇద్దరి మృతదేహాలను స్వగ్రామానికి తరలించి శనివారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఒకేసారి భార్యను, కుమారుడిని కోల్పోవడంతో వెంకట్రాయుడు కుమిలిపోతున్నాడు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆయనను పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. తండ్రిలాగే నర్సరీ రైతైన శ్రీనివాసరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ఇంగ్లీష్ విద్యపై ప్రభుత్వ నిర్ణయం సరైందే
-
‘ఇప్పటివరకు 8 మృతదేహాలకు పోస్టుమార్టం’
సాక్షి, తూర్పుగోదావరి : గోదావరిలో దేవీపట్నం వద్ద బోటు ప్రమాదం ఘటనపై మంత్రి ఆళ్లనాని మీడియాతో సోమవారం మాట్లాడారు. ప్రమాద ఘటనలో గల్లంతైన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రమాద ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారని.. అనంతరం బాధిత కుటుంబాలను కలుసుకుంటారని ఆయన చెప్పారు. ఇప్పటికే 8 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిందని తెలిపారు. బాధితుల బంధువులకు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. (చదవండి : బోటు ప్రమాదం: 315 అడుగుల లోతులో లాంచీ) ప్రమాదం నుంచి బయటపడ్డ 26 మందికి వైద్య సేవలందించామని తెలిపారు. ఒక వ్యక్తి కాలుకు ఫ్యాక్చర్ అయిందని, డాక్టర్లు సేవలందిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే సీఎం జగన్ బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని గుర్తు చేశారు. బోటు ఓనరును విశాఖకు చెందిన కోడిగుడ్ల వెంకటరమణగా గుర్తించామని తెలిపారు. మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి వద్ద అంబులెన్స్‌లను ఏర్పాటు చేశామని మంత్రి కన్నాబాబు తెలిపారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు సమాచారం అందించేందుకు హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశామన్నారు. (చదవండి : అక్కడ బోటు నడపడం ప్రాణాలతో చెలగాటమే) -
అక్కడ మొదటిసారిగా బరిలోకి బీసీ..
సాక్షి, రాజమహేంద్రవరం రూరల్: నిత్యం ప్రజలతో ఉండేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తన లక్ష్యమని వైఎస్సార్సీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి మార్గాని భరత్‌రామ్ అన్నారు. ఎంతో కీలకమైన రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానాన్ని ఎప్పుడూ లేని విధంగా బీసీ సామాజికవర్గానికి కేటాయించడం ఒక్క జగన్మోహన్రెడ్డికే సాధ్యమైందన్నారు. పార్టీ ప్రోత్సాహం, కుటుంబ సహకారంతో తాను ఎంపీగా గెలిస్తే ఏం చేస్తానన్నదానిని గురించి ఆయన వివరించారు. రాజమహేంద్రవరాన్ని నిర్లక్ష్యం చేశారు.. ∙ఇప్పటి వరకు రాజమహేంద్రవరాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు. అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. గత ఎన్నికల హామీలను కూడా పక్కన పడేశారు, దీంతో ఈ ప్రాంతంలోని అన్ని వర్గాల్లో తీవ్ర నిరాశ నెలకొంది. యువతకు ఉపాధి కల్పనే ప్రాధాన్యం ∙రాష్ట్రం విడిపోయాక ఉభయగోదావరి జిల్లాల్లోని యువకులు ఉద్యోగాల్లేక ఇబ్బంది పడుతున్నారు. నా మొదటి ప్రాధాన్యం ఉభయగోదావరి జిల్లాల్లోని యువతకు ఉద్యోగాలు కల్పించడమే. రాజమహేంద్రవరం–కాకినాడల మధ్య ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల్లో ప్రత్యేక ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలోని యువతకు ఉపాధి లభిస్తుంది. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని జగన్ ఇప్పటికే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు గెలవాలి. తద్వారా కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో కీలకంగా ఉంటాం. అప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యపడుతుంది. తద్వారా పరిశ్రమలు వస్తాయి. ఇక్కడి యువతకు ఉపాధి దక్కుతుంది. రాజమహేంద్రవరం–కాకినాడ మధ్య అంతర్జాతీయ స్టేడియం నిర్మిస్తే జంటనగరాలుగా భవిష్యత్తులో అభివృద్ధి చెందుతాయి. వేమగిరి–కాకినాడ మధ్య రహదారి మార్గం మరింత మెరుగుపరిస్తే ఈ ప్రాంతమంతా మరింత అభివృద్ధి చెందుతుంది. రాజమహేంద్రవరం నగరానికి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ఇండోర్ స్టేడియం, తీసుకొస్తాం. అన్ని రకాల క్రీడలు ఇక్కడ నిర్వహించే విధంగా కృషి చేస్తాం. స్కూలు పిల్లలకు ఇక్కడ శిక్షణ ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చర్యలు తీసుకుంటాం. అంతర్జాతీయ కోచ్‌లు, క్రీడాకారులు మన ప్రాంతానికి వస్తారు. రాజమహేంద్రవరం చుట్టుపక్కల గోదావరి లంకల్లో ఉన్న ప్రాంతాల్లో టూరిజం పెంచుతాం. వాటర్ స్పోర్ట్స్, అడ్వంచర్ స్పోర్ట్స్, ఈవెంట్స్ నిర్వహిస్తాం. పర్యాటకులకు గోదావరి అందాలను చూపిస్తాం. స్పీడ్‌బోట్స్, పారా గ్లైడింగ్ వంటి వాటిని ఏర్పాటు చేస్తాం. హేవ్‌లాక్ బ్రిడ్జిని వెడల్పు చేసి ఫ్యాషన్ స్ట్రీట్‌గా మారుస్తాం. వాకింగ్ స్పాట్, సాయంత్రం పూట ఆహ్లాదకరమైన మార్కెట్ ప్లేస్‌గా చేస్తాం. మోరంపూడి ఫ్లై ఓవర్, లాలాచెరువు, వేమగిరి ఫ్లై ఓవర్లు మూడుగా కాకుండా ఒక్కటిగా చేస్తే బయట ప్రాంతాల నుంచి వచ్చే ట్రాఫిక్ దానిమీదుగా వెళ్లిపోతుంది. సిటీ ట్రాఫిక్‌ను కింది నుంచి మళ్లించడం వల్ల వందలాది ప్రమాదాలను నివారించవచ్చు. గోదావరి పక్కనున్న గ్రామాలకు తాగునీటి సదుపాయం పూర్తిస్థాయిలో లేదు. ఇంటింటికీ గోదావరి తాగునీటిని పంపిణీ చేయాలి. గోదావరి నదిలో డ్రైనేజీ వాటర్ కలవకుండా చర్యలు చేపడతాం, తద్వారా గోదావరి పవిత్రతను కాపాడుతా. పవిత్ర గోదావరి నదిని కాపాడే ప్రయత్నం ఇంత వరకు ఏ ప్రభుత్వమూ చేయలేదు. జగన్ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఆ పనిచేసి చూపిస్తాం. రాజకీయ స్ఫూర్తి.... ∙మా తాత ఆరేపల్లి సుబ్బారావు రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్‌గా, ప్రత్యేక అధికారిగా పనిచేశారు. ఇక్కడ కోటగుమ్మం నుంచి డీలక్స్ సెంటర్ వరకు రోడ్డు వెడల్పు, ఆనం కళాకేంద్రాన్ని 1970లోనే ఆయన నిర్మించారు. ఇప్పటి వరకు అదొక్కటే ఇక్కడ ఉంది. మరొకటి లేదు. ఆయన స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చాను. మా నాన్న మార్గాని నాగేశ్వరరావు 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. వారిద్దరే స్ఫూర్తి నాకు జగనే నా బలం ∙మా ప్రధాన బలం జగన్మోహన్రెడ్డి.ఆయనను ప్రతి ఒక్కరు విశ్వసిస్తున్నారు. జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందుతుందన్న నమ్మకం కూడా పెరిగింది. అదే సమయంలో చంద్రబాబు మోసపూరిత హామీలను కూడా ప్రజలు గుర్తించారు. పవన్, చంద్రబాబులు ఇద్దరూ ఒక్కటేనని ప్రజలు నమ్ముతున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇస్తున్న తాయిలాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. చంద్రబాబుకు ఇప్పుడు ఓటు వేస్తే మళ్ళీ ఎన్నికలప్పుడే మనం గుర్తుకొస్తామని గ్రామస్థాయిలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇచ్చింది తీసుకుని జగన్‌కు ఓటేస్తామని పలువురు నేరుగా మాకు చెబుతున్నారు. వృద్ధులు కూడా జగన్ ప్రకటించాకనే చంద్రబాబు పెన్షన్ పెంచాడంటున్నారు. చదువు, కుటుంబం, సేవలు ∙నాతోపాటు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. నేను ఎంబీఏ చేశాను. వ్యాపార రంగంలో ఉన్నాం. మా తాత ముత్తాతల నుంచి వంద ఏళ్లుగా వ్యాపార రంగంలో ఉన్నాం. మరోవైపు సమాజానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో మార్గాని రామారావు చారిటబుల్ ట్రస్టు ద్వారా పలు సేవలు చేస్తున్నాం. ప్రజలకు అందుబాటులో ఉంటా ∙ జగన్‌తో పాటు 30 ఏళ్లపాటు రాజకీయాల్లో పయనిద్దామని ముందుకొచ్చాను. క్లీన్ ఇమేజ్‌తో నేను రాజకీయ జీవితం ప్రారంభిస్తున్నాను. మళ్లీ ఎన్నికలకు వెళ్లేటప్పుడు నేను ఇది చేశాను కనుక నాకు ఓటేయండి అని అడుగుతాను. ఆ విధంగా నేను ఇక్కడే అందుబాటులోఉంటాను. బీసీలకు సీటు కేటాయించిన ఘనత జగన్‌దే స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానం ఒక బీసీ కులానికి కేటాయించిన ఘనత జగన్‌కే దక్కుతుంది. ఈ కారణంగానే పలు బీసీ సంఘాలు స్వచ్ఛందంగా తీర్మానాలు చేసి, గెలుపునకు కృషి చేస్తామని ముందుకు వస్తున్నారు. మా కుటుంబ సభ్యులకు ఉభయగోదావరి జిల్లాల్లోని ఇతర కులాలకు చెందిన వారితో మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో మాకు అందరూ సహకరిస్తున్నారు. -
తూర్పుగోదావరి జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన గోదావరి
-
పండుటాకులకూ పెన్షన్ తీసేస్తారా?
-
225వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
-
195వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
-
2400 కిలోమీటర్లు పూర్తి చేసిన వైఎస్ జగన్
-
195వరోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, రాజోలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 195వ రోజు ప్రారంభమైంది. గురువారం ఉదయం శివకోడు నుంచి జననేత పాదయాత్రను ప్రారంభిస్తారు. రాజన్న బిడ్డ పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. అక్కడి నుంచి లక్కవరం క్రాస్ మీదుగా చింతలపల్లి వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర లక్కవరం వద్ద 2,400 కిలో మీటర్ల మైలురాయిని చేరుకుంటుంది. అడుగడుగునా ప్రజలు జననేతకు నీరాజనాలు పలుకుతున్నారు. వైఎస్ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్ జగన్ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. -
193వరోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
-
జనవాహిని తోడుగా గోదారమ్మ వంతెనపై జననేత పాదయాత్ర
-
జనజీవన స్రవంతిలోకి రావాలి
కాకినాడ రూరల్: మావోయిస్టులు ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు ఇష్టపడుతున్నారని, అటువంటి వారికి ప్రభుత్వపరంగా సాయం చేసి, స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు అవసరయ్యే చర్యలను తీసుకుంటామని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని అన్నారు. మంగళవారం సాయంత్రం ఏటపాక పోలీస్‌స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ముగ్గురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేయగా, మరో మావోయిస్టు బుధవారం ఎస్పీ గున్నీ ఎదుట లొంగి పోయాడు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఒడిస్సా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా, మోటు పోలీస్‌స్టేషన్ పరిధిలోని తొగరుకోట గ్రామానికి చెందిన ఆంధ్రా ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ పరిధిలోని పప్పలూరు ఏరియా కమిటీ దళంలో ఏసీఎంగా పని చేసిన మడకం ఎర్రయ్య అలియాస్ రుషి (33) బుధవారం ఎస్పీ విశాల్ గున్ని ఎదుట లొంగిపోయాడు. ఇతనికి తక్షణ ఆర్థిక సహాయం కింద రూ. 20 వేలు, పునరావాసం కోసం జిల్లా కలెక్టర్‌కు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే విధంగా ఇతని తలపై ఉన్న రివార్డు మొత్తం కోసం మల్కాన్‌గిరి జిల్లా ఎస్పీకి లేఖ రాస్తున్నట్లు ఎస్పీ విశాల్ గున్ని వివరించారు. అలాగే చింతూరు ఏఎస్డీ, ఎస్డీపీవోల ఆదేశాలపై ఏటపాక పోలీస్‌స్టేషన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో డీఏకేఎంఎస్‌కు చెందిన ఒక దళ సభ్యుడు, ఇద్దరు మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ వివరించారు. చత్తీస్ఘఢ్ సుకుమా జిల్లా పాలోడ్‌కు చెందిన మడివి రామ అనే డీఏకేఎంఎస్ దళానికి చెందిన వ్యక్తి, అతనితో పాటు భద్రాది కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలం చిన్ననల్లబిల్లి గ్రామానికి చెందిన మోలుమురి శ్రీనివాసరావు, అదే మండలం పెద్ద నల్లబిల్లి గ్రామానికి చెందిన పాయం జోగారావు కొరియర్లను అరెస్టు చేసి రూ. 70 వేలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) వై.రవిశంకర్‌రెడ్డి, రంపచోడవరం ఏఎస్పీ అజిత్ వేజెండ్ల పాల్గొన్నారు. -
వాకతిప్ప పేలుడు బాధితులకు నేడు జగన్ పరామర్శ
సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం వాకతిప్ప విస్ఫోట బాధితులను పరామర్శించనున్నారు. గత వారం రోజులుగా ఉత్తరాంధ్ర లోని తుపాను పీడిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన వాకతిప్ప బాణసంచా తయారీ కేంద్రంలో సోమవారం సంభవించిన పేలుడు దుర్ఘటనను తెలుసుకుని దిగ్భ్రాంతి చెందారు. ముందు అనుకున్న దాని ప్రకారం ఆయన మరో రెండురోజులు శ్రీకాకుళం జిల్లాలోని తుపాను బాధిత గ్రామాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే పేలుడు బాధితులను సత్వరం ఊరడించాలన్న సంకల్పంతో మంగళవారం రాత్రే శ్రీకాకుళం నుంచి నేరుగా కాకినాడ చేరుకుని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇంట బస చేశారు. పలువురు పార్టీ నేతలు ఆయనను కలుసుకుని పేలుడు వివరాలను తెలిపారు.