సాక్షి, రాజోలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 195వ రోజు ప్రారంభమైంది. గురువారం ఉదయం శివకోడు నుంచి జననేత పాదయాత్రను ప్రారంభిస్తారు. రాజన్న బిడ్డ పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. అక్కడి నుంచి లక్కవరం క్రాస్ మీదుగా చింతలపల్లి వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర లక్కవరం వద్ద 2,400 కిలో మీటర్ల మైలురాయిని చేరుకుంటుంది. అడుగడుగునా ప్రజలు జననేతకు నీరాజనాలు పలుకుతున్నారు.
వైఎస్ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్ జగన్ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment