సాక్షి, తూర్పుగోదావరి : గోదావరిలో దేవీపట్నం వద్ద బోటు ప్రమాదం ఘటనపై మంత్రి ఆళ్లనాని మీడియాతో సోమవారం మాట్లాడారు. ప్రమాద ఘటనలో గల్లంతైన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాద ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారని.. అనంతరం బాధిత కుటుంబాలను కలుసుకుంటారని ఆయన చెప్పారు. ఇప్పటికే 8 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిందని తెలిపారు. బాధితుల బంధువులకు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు.
(చదవండి : బోటు ప్రమాదం: 315 అడుగుల లోతులో లాంచీ)
ప్రమాదం నుంచి బయటపడ్డ 26 మందికి వైద్య సేవలందించామని తెలిపారు. ఒక వ్యక్తి కాలుకు ఫ్యాక్చర్ అయిందని, డాక్టర్లు సేవలందిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే సీఎం జగన్ బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని గుర్తు చేశారు. బోటు ఓనరును విశాఖకు చెందిన కోడిగుడ్ల వెంకటరమణగా గుర్తించామని తెలిపారు. మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి వద్ద అంబులెన్స్‌లను ఏర్పాటు చేశామని మంత్రి కన్నాబాబు తెలిపారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు సమాచారం అందించేందుకు హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశామన్నారు.
(చదవండి : అక్కడ బోటు నడపడం ప్రాణాలతో చెలగాటమే)
Comments
Please login to add a commentAdd a comment