‘అయ్యా.. నా పేరు బండారు అప్పలరాజు. వయస్సు 84 ఏళ్లు. నాది తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం దివిలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డులున్నాయి. ఏ విధంగా చూసినా పెన్షన్‌కు అర్హురాలినే. కానీ, జన్మభూమి కమిటీల దురాగతంతో ఈ వయస్సులో నాకు పెన్షన్ లేకుండా చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయమని, పండుటాకులకు పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పిన చంద్రబాబు పెన్షన్ ఎగ్గొట్టారు.