51 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కనున్న హీరో | Thiagarajan Confirms Prashanth to Get Married for Second Time | Sakshi
Sakshi News home page

51 ఏళ్ల వయసులో హీరో రెండో పెళ్లి? నిజమేనన్న తండ్రి

Aug 19 2024 9:43 AM | Updated on Aug 19 2024 9:56 AM

Thiagarajan Confirms Prashanth to Get Married for Second Time

కోలీవుడ్‌ హీరో ప్రశాంత్‌ రెండోసారి పెళ్లిపీటలెక్కనున్నాడు. 51 ఏళ్ల వయసున్న ఈయన త్వరలోనే మరోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని ఆయన తండ్రి, దర్శకుడు త్యాగరాజన్‌ వెల్లడించాడు.

అంధగన్‌ సినిమా సక్సెస్‌ మీట్‌లో త్యాగరాజన్‌.. ప్రశాంత్‌ పెళ్లి గురించి మాట్లాడాడు. వధువు గురించి వెతుకులాట మొదలుపెట్టామని, త్వరలో గుడ్‌న్యూస్‌ చెబుతామని తెలిపాడు. ఈ మాటలతో స్టేజీపై ఉన్న ప్రశాంత్‌ కాస్త సిగ్గుపడినట్లు కనిపించాడు.

కాగా 2005లో ప్రశాంత్‌కు గృహలక్ష్మి అనే మహిళతో పెళ్లి జరిగింది. కానీ ఈ బంధం ఎంతోకాలం నిలబడలేదు. 2009లో వీరు విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఈయన సింగిల్‌గానే ఉంటున్నాడు. కెరీర్‌పైనే పూర్తి ఫోకస్‌ పెట్టిన ప్రశాంత్‌ ఇన్నాళ్లకు మళ్లీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు.

సినిమాల విషయానికి వస్తే.. ఈయన తెలుగులో లాఠి, ప్రేమ శిఖరం, తొలి ముద్దు చిత్రాల్లోనూ నటించాడు. వినయ విధేయ రామలో కీలక పాత్రలో మెప్పించాడు. ఇటీవలే అంధగన్‌లో హీరోగా నటించిన ఈయన ప్రస్తుతం గోట్‌ సినిమా చేస్తున్నాడు. ఇందులో విజయ్‌ స్నేహితుడిగా కనిపించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement