దుబ్బాక/కొండపాక/మెదక్ టౌన్/ పటాన్‌చెరు టౌన్ : జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇదే ఘటనలో నలుగురు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. దుబ్బాక నియోజకవర్గం, మిరుదొడ్డి మండలం భూంపల్లికి చెందిన కుర్మ మల్లవ్వ, పెంటయ్య దంపతుల పెద్ద కుమారుడు ప్రశాంత్ (17) దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుకుంటున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం ప్రశాంత్ బస్‌లో కళాశాలకు వెళ్లా డు. కళాశాల ముగిశాక దుబ్బాక నుంచి మధ్యలో ఉన్న హబ్షీపూర్ వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచి భూంపల్లి వెళ్లేందుకు మరో బస్ కోసం వేచి ఉన్నాడు.
ఈ క్రమంలోనే తమ గ్రామానికి చెందిన బండారి పరుశురాములు మోటారు సైకిల్‌పై వెళుతుండడంతో అందులో గ్రామానికి బయలుదేరాడు. అయితే లారీ.. ముందు వెళ్లే బస్సును ఓవర్‌టేక్ (అధిగమిస్తూ) చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్‌ను ఢీకొం ది. ఈ సంఘటనలో మోటార్ సైకిల్ వెనక కూర్చొన్న ప్రశాంత్ తలపై లారీ చక్రం ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న పరుశురాములు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని 108 వాహనంలో సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసున్న దుబ్బాక ఎస్‌ఐ లెనిన్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారాణమైన లారీని దుబ్బాక పోలీస్‌స్టేషన్‌కు తరలించి డ్రైవర్ ఎర్రనాయుడును అదుపులో తీసుకున్నామన్నారు. వాహనం వైజాగ్‌దిగా గుర్తించినట్లు ఎస్‌ఐ వివరించారు.
మా ఆశలన్నీ.. నీమీదే కదా..
ఆశలన్నీ నీమీదే పెట్టుకున్నాం కదా నాయినా.. అంటూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రశాంత్ మృతదేహంపై తల్లిదండ్రులు మల్లవ్వ, పెంటయ్యలు గుండె లవిసేలా రోదించారు. వీరితో పాటు ప్రశాంత్ సోదరుడు శ్రీకాంత్, సాదరి విజయలు కన్నీరుమన్నీరయ్యారు. మృతదేహాన్ని చూసేందుకు దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి భూంపల్లి గ్రామస్థులు, మృతుడి బంధువులు బారులు తీరారు.
వాహనం ఢీకొని మరొకరు..
పటాన్‌చెరు టౌన్: గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని ఇస్నాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాంప్రసాద్ కథనం మేరకు.. గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని (32) వ్యక్తిని ఇస్నాపూర్ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
Published Fri, Sep 13 2013 11:58 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement