
దండేపల్లి: కాలేజీలో దింపేందుకు తీసుకెళ్లిన తండ్రి వద్దనుంచి కరీంనగర్ బస్టాండ్‌లో తప్పించుకున్న ఓ ఇంటర్ విద్యారి్థ...మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం వద్ద గోదావరినదిలో శవమై తేలాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
దండేపల్లికి చెందిన నానవేని మల్లేశ్ కుమారుడు నానవేని ప్రశాంత్, అలియాస్ గట్టు(19) కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల కాలేజీ నుంచి ఇంటికి వచ్చాడు. మంగళవారం అతన్ని కాలేజీలో దింపేందుకు తండ్రి మల్లేశ్ కరీంనగర్ బయల్దేరాడు.
కరీంనగర్ బస్టాండులో దిగగానే ప్రశాంత్ తప్పించుకున్నాడు. కొద్దిసేపు బస్టాండులో అతనికోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. కాలేజీకి వెళ్లి ఆరా తీయగా, కాలేజీకి రాలేదని చెప్పారు. దీంతో ఇంటికే వచ్చాడేమో అని తండ్రి దండేపల్లికి రాగా..ఇంటికి కూడా రాలేదని కుటుంబసభ్యులు చెప్పడంతో ప్రశాంత్‌ను వెదికేందుకు బయటికి వెళ్లాడు.
ఇంతలో సాయంత్రం గూడెం గోదావరినదిలో శవం ఉందని తెలియడంతో అక్కడికి వెళ్లి చూడగా, అది ప్రశాంత్‌ది కావడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ప్రశాంత్‌ను గతేడాది దండేపల్లి జూనియర్ కాలేజీలో చేరి్పంచగా ఫెయిల్ అయ్యాడు.
అతన్ని ఆ కాలేజీ నుంచి తీసి, ఈయేడాది కరీంగర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో చేరి్పంచారు. చదవడం ఇష్టం లేకనే గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబీకులు, బంధువులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment