
హీరో రామ్ చరణ్
ప్రస్తుతం సుకుమార్ దర్శకత‍్వంలో తెరకెక్కుతున్న రంగస్థలంలో సినిమాలో నటిస్తున్న యంగ్ హీరో రామ్ చరణ్, ఆ సినిమా తరువాత మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా కోసం ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ ప‍్రతినాయకుడిగా నటించనున్నాడు.
ఇతర కీలక పాత్రలకు స్టార్ ఇమేజ్ ఉన్న తారలను ఎంపిక చేస్తున్నాడు బోయపాటి. కథ ప్రకారం ఈ సినిమాలో చెర్రీకి ఇద్దరు అన్నలు ఉంటారట. వీరిలో ఒక అన్నగా తమిళ హీరో ప్రశాంత్ (జీన్స్ ఫేం), మరో అన్నగా నవీన్ చంద్ర(అందాల రాక్షసి ఫేం)లు కనిపించనున్నారు. రామ్ చరణ్ వదినగా అందాల నటి స్నేహ అలరించనుంది. ఈ సినిమాలో చరణ్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడన్న ప‍్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment