రంగస్థలం సక్సెస్ తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సాంకేతిక విభాగంలో మార్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇన్నాళ్లు సినిమాకు సినిమాటోగ్రఫీ అందించిన రిషీ పంజాబీ తప్పుకోవటంతో కొత్త కెమెరామేన్‌ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
కారణాలు వెల్లడించకపోయినా రిషీ పంజాబీ తప్పుకోవటంతో ఆ స్థానంలో ఆర్థర్ విల్సన్‌ను సినిమాటోగ్రాఫర్‌గా తీసుకున్నారట. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. మిగిలి ఉన్న టాకీ పార్ట్‌తో పాటు పాటలకు విల‍్సన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. ఈ సినిమాలో చరణ్‌కు జోడిగా కియారా అద్వానీ నటిస్తుండగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment