బ్యాంకాక్‌కు చెర్రీ, బోయపాటి | Ram Charan And Boyapati Srinu Movie Shooting Update | Sakshi
Sakshi News home page

Published Sun, May 6 2018 3:40 PM | Last Updated on Sun, May 6 2018 3:40 PM

Ram Charan And Boyapati Srinu Movie Shooting Update - Sakshi

రంగస్థలం లాంటి ఘనవిజయం తరువాత మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేజర్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో పూర్తయ్యింది. తదుపరి షెడ్యూల్‌ మే 12 నుంచి బ్యాంకాక్‌లో జరగనుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దానయ్య మాట్లాడుతూ ‘మాస్‌ ఇమేజ్‌ ఉన్న హీరో రామ్‌ చరణ్‌, మాస్‌ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సినిమా అంటే సినిమాపై ఎన్ని అంచనాలుంటాయో అందరికీ తెలిసిందే. ఆ అంచనాలకు ధీటుగా సినిమాను రూపొందిస్తున్నాం. సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌లో మేజర్‌ షెడ్యూల్‌ పూర్తయ్యింది. అందులో భాగంగా రామోజీ ఫిలిం సిటీలో ఫ్యామిలీ సన్నివేశాలను, అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్‌ ఎపిసోడ్‌ను పూర్తి చేశాం. ఈ 20 రోజుల షెడ్యూల్‌లో రామ్‌ చరణ్‌, ప్రశాంత్‌, స్నేహ, కియారాలతో పాటు ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించారు.

అంతుకు ముందుకు చిత్రీకరించిన 15 రోజుల షెడ్యూల్‌లో వివేక్‌ ఒబెరాయ్‌ సహా ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించాం. తదుపరి షెడ్యూల్‌ కోసం యూనిట్‌ బ్యాంకాక్ వెళుతోంది. ఈ షెడ్యూల్‌ 15 రోజుల పాటు సాగుతుంది. మెగాభిమానులు, ప్రేక్షకులను అలరించేలా రామ్‌ చరణ్‌ను సరికొత్త యాంగిల్‌లో ప్రెజెంట్‌ చేస్తున్నారు డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు పవర్‌ ప్యాక్డ్‌ యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమాను రూపొందిస్తున్నాం’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement